April Fool Prank: ఏప్రిల్ 1వ తేదీన 'ఏప్రిల్ ఫూల్'డే పరిగణిస్తున్న విషయం తెలిసిందే. సరదాగా ఇతరులను నవ్వించేందుకు.. భయపెట్టే ప్రయత్నం ఇది. నవ్వుకోవడానికి.. సరదా ప్రయత్నాలకు 'ఏప్రిల్ ఫూల్'డేను వాడుకోవడం చేస్తుంటారు. అలాగే తన స్నేహితుడిని సరదాగా 'ఏప్రిల్ ఫూల్' చేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం కాస్త అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఏప్రిల్ ఫూల్ అటుంచి అతడు మృతి చెందడానికి దారి తీసింది. ఈ ఘోర సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: Nightclub Fire: నైట్‌క్లబ్‌లో ఘోర విషాదం.. అగ్నికీలలు చెలరేగి 29 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణానికి చెందిన అభిషేక్ రఘువంశీ (18) 11వ తరగతి చదువుతుండేవాడు. ఏప్రిల్ 1వ తేదీన ఏప్రిల్ ఫూల్ డేగా పరిగణిస్తుండడంతో సరదాగా తన స్నేహితుడిని ఆట పట్టించాలని భావించాడు. ఇంట్లో ఒక కుర్చీ వేసుకుని ఫ్యాన్ తాడు వేసి ఉరేసుకుంటున్నట్లు చేశాడు. తన స్నేహితుడికి వీడియో కాల్ చేసి ఉరేసుకుంటున్నట్లు నటించాడు. తన స్నేహితుడిని సరదాగా ఆటపట్టిదామని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కుర్చీ పక్కకు ఒరిగింది. దీంతో ఉరితాడు అతడి మెడకు బిగుసుకుపోయింది. ఇది చూసి కంగారుపడిపోయిన ఫోన్ అవతలి స్నేహితుడు వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
Also Read: Fire Accident: బాత్రూమ్‌లో చిక్కుకున్న అక్కాచెల్లెళ్లు.. తలుపులు పగులగొట్టి కాపాడినా కన్నీరే!
సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు అభిషేక్ ఉరికి వేలాడుతున్న దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. కిందకు దించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అభిషేక్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయంపై స్థానిక డీసీపీ రాజేశ్ దందోతియా కీలక విషయాలు వెల్లడించారు. 'ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటించేందుకు అభిషేక్ తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. స్టూల్ వేసుకుని తాడు గొంతుకు ఉంచుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పొరపాటున కాళ్ల కింద ఉన్న స్టూల్ జారిపోయింది. ఆ తాడు మెడకు చుట్టుకుని అభిషేక్ మరణానికి కారణమైంది' అని డీసీపీ వెల్లడించారు.
ఈ సంఘటనపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితులను, ఇతరులను నవ్వించేందుకు.. ఆశ్చర్యానికి గురి చేసేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాంటి దారుణ సంఘటనలే చోటుచేసుకుంటాయని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. నవ్వించడానికి.. ప్రాంక్ చేయడానికి ఒక హద్దు ఉండాలని సూచిస్తున్నారు. సెల్‌ఫోన్లు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలని, ఫాలోవర్లు, లైక్‌ల కోసం యువత ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని పలువురు సీనియర్ సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ ఫూల్ చేయబోయి ఆ అబ్బాయే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వివరించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook