Divyansha Kaushik Controversial Pic సోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎలా ట్రోలింగ్‌కు గురవుతారో చెప్పలేం. సోషల్ మీడియాలో పాజిటివ్‌గా ఎంత మంది ఆలోచిస్తుంటారో.. నెగెటివ్‌గా అంతే మంది ఆలోచిస్తుంటారు. దివ్యాంశ కౌశిక్ తాజాగా షేర్ చేసిన ఫోటోల మీద పాజిటివ్ కామెంట్ల కంటే ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్, మీమ్స్ కనిపిస్తున్నాయి. దీంతో దెబ్బకు దిగొచ్చిన దివ్యాంశ కౌశిక్ అసలు పాయింట్ చెప్పింది. లైట్ తీసుకోండని అన్నట్టుగా సెటైర్ వేసింది.
దివ్యాంశ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె రెండు పండ్లను ఆమె చేతిలో పట్టుకుంది. అవి కూడా ఎద భాగంలో పట్టుకుని కనిపించింది. దీంతో జనాలు రకరకాలుగా కామెంట్లు చేయసాగారు. నువ్ ఈ ఫోటోలు ఏ ఉద్దేశంతో షేర్ చేశావ్?.. అసలు ఎందుకు ఇలాంటి ఫోటోలు షేర్ చేశావ్? నీకు తెలిసి చేస్తున్నావా? తెలియక చేస్తున్నావా? అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో దివ్యాంశ ఈ కామెంట్లకు రియాక్ట్ అయింది.
😶🌫️ pic.twitter.com/CtcLqEP0Km
— Divyansha Kaushik (@itsdivyanshak) May 2, 2023
అది ఓ సాధారణమైన పోజ్.. చిల్ అవ్వండి అంటూ క్లారిటీ ఇచ్చింది దివ్యాంశ. అంటే జనాలు అనుకుంటున్నట్టుగా డబుల్ మీనింగ్ కోసం ఆ పోజు పెట్టలేదని, ఆ పోస్ట్ పెట్టలేదని చెప్పకనే చెప్పేసింది. దివ్యాంశ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆమె వింత పోజుల మీద రకరకాల మీమ్స్, ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.
Also Read: Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి
తెలుగు తమిళ హిందీ భాషల్లో దివ్యాంశ సినిమాలు చేసింది. కానీ ఎక్కడా కూడా సక్సెస్ కాలేకపోతోంది. ఇప్పుడు ఆమె ఆశలన్నీ కూడా సిద్దార్థ్ టక్కర్ సినిమా మీదే ఉంది. ఈ మధ్యే సిద్దార్త్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్‌ను వదిలారు. అందులో దివ్యాంశ మరింత బోల్డ్‌గా కనిపించి రొమాంటిక్ సీన్స్‌లో అదరగొట్టేసినట్టు కనిపించింది. మరి ఈ సినిమా అయినా దివ్యాంశను నిలబెడుతుందా? చూడాలి.
Also Read: Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook