Weight loss By Ajwain: వాము శరీరానికి ఎంతో సహాయపడడమే కాకుండా బరువును కూడా తగ్గింస్తుంది. ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాకుండా బరువును తగ్గించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతున్న వారికి ఇది చక్కటి పరిష్కారం. మంచి విషయం ఏమిటంటే ఆకుకూరలు మార్కెంట్‌లో విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఈ ఆకు కూరలను తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించేందుకు చాలా ఉపయోగపడతాయని అంటున్నారు. ఆకు కూరాలు, వావు రెండు శరీర బరువును తగ్గించడానికి దోహదపడతాయని.. అంతే కాకుండా శరీరాని మంచి పోషక విలువలను అందిస్తాయంటున్నారు. కాబట్టి వీటి వల్ల బరువు తగ్గే మార్గమేంటో తెలుసుకుందాం.
ప్రతిరోజూ ఉదయం ఆకుకూరలను తినండి:
సెలెరీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఆకు కూరను వారంలో ఒక రోజు తీనడం వల్ల శరీరానికి మంచి లాభాలు పొందవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.
వాముతో ఎంత లాభం:
వాము (అజ్వైన్)ను వేడి నీటిలో కలిపి తాగడం వల్ల మంచి లాభాలుంటాయని వైద్యులు తెలిపారు. ఇంతే కాకుండా దీనిని ఆహారంలో కూడా ఉపయోగించవచ్చన్నారు. దీన్ని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని సూచించారు. వామును తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిక్ అనే పదార్థం విడుదలవుతుందని.. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుందని వెల్లడించారు. దీనితో పాటు ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుందన్నారు.
ఆకుకూరలు తినేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
కొంతమంది త్వరగా బరువు తగ్గాలని ఆకుకూరలను పెద్ద పరిమాణంలో తీసుకుంటారు. ఇది చాలా సమస్యలకు దారి తీస్తుంది. వేసవిలో పొరపాటున అజ్వైన్ వాటర్ తాగకండి..ఎందుకంటే అది మీ కడుపులో సమస్యలకు దారి తీస్తుంది.
( Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Political Heat In Telangana: తెలంగాణలో జాతీయ నేతల టూర్లు..మొదలైన ఎన్నికల జాతర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook