Raw Banana For Bp And Diabetes In Telugu: ఫ్రూట్ సలాడ్ నుండి నైవేద్యాల వరకు అన్నింటిలోనూ అరటి పండ్లను వినియోగిస్తారు. అరటి పండ్లలో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి తరచుగా బరువు పెరగడం, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో అరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ తో పాటు విటమిన్ ఏ, జింక్, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ b6, పొటాషియం వంటి అనేక రకాల సమ్మేళనాలు లభిస్తాయి. ముఖ్యంగా పండిన అరటిపండుకు బదులుగా కాయను తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షించడమే కాకుండా రక్తపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులైన అధిక రక్తపోటును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా అరటికాయలు యాంటీ డయాబెటిస్ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. ఇవే కాకుండా రా బనానా ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పచ్చి అరటిపండును తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు:
జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది:
పచ్చి అరటిపండును ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ లభిస్తుంది. దీంతోపాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట కూడా నిండుగా ఉంటుంది.
మధుమేహం నియంత్రణ కోసం:
పచ్చి అరటిపండు ప్రతిరోజు తినడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయం:
ప్రస్తుతం చాలామంది ఊబకాయం సమస్య నుంచి బయటపడేందుకు వివిధ రకాల డైట్లను అనుసరిస్తున్నారు. అయితే సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు తీసుకునే డైట్లో భాగంగా వచ్చి అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణ క్రియ మెరుగుపడి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు కడుపును నిండుగా ఉంచేందుకు సహాయపడతాయి.
BP సమస్యలకు చెక్:
బీపీ సమస్య కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు రా బనానా ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థాలు పెరుగుతున్న కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. దీనికి కారణంగా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి