Viral: యూపీలో దారుణం... ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించారు..

Hospital Crime:  ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డెంగ్యూ రోగికి ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 08:13 AM IST
Viral: యూపీలో దారుణం... ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించారు..

Prayagraj News Today: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించడంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి మరణానికి కారణమైన ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు.

వివరాల్లోకి వెళితే..
ప్రయాగ్‌రాజ్‌లోని బమ్రౌలీ నివాసి ప్రదీప్ పాండే అనారోగ్యంతో వారం క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అతడికి రిపోర్టులో డెంగ్యూ అని నిర్ధారణ అయింది. అతడి ప్లేట్‌లెట్స్ కౌంట్ భారీగా పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యులు బయట నుంచి ప్లేట్‌లెట్ల ప్యాకెట్‌’ తెప్పించి రోగికి ఎక్కించారు. ఒక్కసారిగా అతడి ఆరోగ్యం క్షీణించింది. తాము ఎక్కిస్తున్నది ప్లేట్‌లెట్స్ కాదని పళ్ల రసమని కాసేపటికి గుర్తించారు. రోగి కండిషన్ విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రదీప్ ప్రాణాలు నిలవలేదు. 

దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్. రోగి మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రిపై జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంది. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం ఆస్పత్రికి సీల్‌ వేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని కూడా సీఎంఓ ఏర్పాటు చేసింది. ట్రీట్ మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. 

Also Read: Kedarnath Helicopter Crash: కేదార్‌నాథ్ లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News