సోమవారం జరిగిన ఓ ఘటనలో ఓ యువజంటపై కోల్కతా మెట్రోలో కొందరు దాడి చేశారు. డుమ్ డుమ్ మెట్రో స్టేషనులో ఆలుమగలిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్న సన్నివేశాన్ని చూసిన కొందరు వ్యక్తులు వారిని తూలనాడుతూ.. వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అలా దాడికి పాల్పడిన వారిలో కొందరు వృద్ధులు కూడా ఉన్నారు.
తొలుత భర్తను ప్లాట్ ఫారమ్ వద్దకు ఈడ్చుకువచ్చి కొట్టగా.. వారిని నిలువరించడానికి భార్య కూడా వచ్చింది. ఆమెపై కూడా ఆయా వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వెంటనే కొందరు యువత, మహిళలు వచ్చి ఆ మహిళను కాపాడి.. ఆమె భర్తతో సహా ఆమెను పంపించేయడంతో గొడవ అక్కడితో సద్దుమణిగింది. కానీ ఇదే ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో అనేకమంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టినవారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అనేకమంది నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ రోజు డుమ్ డుమ్ రైల్వే స్టేషన్ బయట స్లోగన్స్ చేస్తూ కొందరు బైటాయించారు. అయితే జరిగిన సంఘటన పై ఎంక్వయరీ వేస్తామని.. అందుకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కోల్కతా మెట్రో తెలిపింది. అయితే ఈ తాజా ఘటనకు సంబంధించి ఇంకా ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు
No one bats an eyelid when females are molested. But couples are beaten up for hugging in public. Oh Kolkata! You made us hang our heads in shame #KolkataMetro pic.twitter.com/Nts8UzwbbF
— Devlina Ganguly (@DevlinaGanguly) May 1, 2018
A young couple embraced in Kolkata metro. It made a bunch of frustrated old losers angry. They beat them up. Scenes of hatred are allowed. Scenes of love are considered obscene. pic.twitter.com/Jv4zNaMDe8
— taslima nasreen (@taslimanasreen) May 1, 2018