Indian Medical Association: దేశంలో గత కొన్నేళ్లుగా దగ్గు కేసులు, జ్వరంతోకూడిన దగ్గు కేసులు పెరుగుతుండడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని ప్రజలకు సూచించింది. ఐఎమ్ఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్, ఇతర సభ్యులు యాంటీబయాటిక్స్ అవసరం లేనప్పుడు తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ నిరోధకత ఏర్పడుతుందని అన్నారు.
యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా రెసిస్టెన్స్ కారణంగా అవి పనిచేయవని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో దగ్గు, వాంతులు, గొంతునొప్పి, జ్వరం, శరీరంలో నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలతో రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతోందన్నారు. సంక్రమణ సాధారణంగా 5 నుంచి 7 రోజుల వరకు ఉంటుందని.. మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుందని చెప్పారు. దగ్గు మూడు వారాల పాటు కొనసాగుతుందన్నారు. ఎన్‌సీడీసీ నుంచి అందిన సమాచారం ప్రకారం.. వీటిలో ఎక్కువ కేసులు H3N2 వైరస్ కారణంగా వచ్చినవే ఉన్నాయి.
ఇన్‌ఫ్లుఎంజా, ఇతర వైరస్‌ల కారణంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కాలానుగుణంగా జలుబు లేదా దగ్గు రావడం సాధారణమని మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. అనేక ఇతర యాంటీబయాటిక్స్ కొన్ని పరిస్థితుల కోసం దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొంది. 70 శాతం డయేరియా కేసులకు యాంటీబయాటిక్స్ అవసరం లేదని.. అయితే వీటికి వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తున్నారని తెలిపింది.
గత రెండు మూడు నెలలుగా మన దేశంలో నిరంతర దగ్గు, జ్వరానికి కారణం 'ఇన్‌ఫ్లుఎంజా A' ఉప రకం 'H3N2' అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్) నిపుణులు చెప్పారు. విస్తృతంగా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2, ఇతర సబ్‌టైప్‌లతో పోలిస్తే రోగులు ఆసుపత్రిలో చేరడానికి ప్రధాన కారణమని ఐసీఎమ్‌ఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. 'వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీస్ నెట్‌వర్క్' ద్వారా శ్వాసకోశ వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులపై ఐసీఎమ్‌ఆర్ నిశితంగా గమనిస్తోంది. దగ్గు, జ్వరం కోసం యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారంగా వాడొద్దని ప్రజలకు కోరింది. అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్‌ను ప్రజలకు సూచించవద్దని వైద్యులకు సూచించింది.
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు
Also Read: Andrey Botikov: కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త హత్య.. బెల్టుతో గొంతు కోసి దారుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook