Union Budget 2025: కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్.. లోక్ సభలో 2025-26 యేడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మహిళ ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వారిపై పలు వరాలు ఝల్లు కురిపించారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహానాలు కొనేవారితో పాటు ఇంట్లో సోలార్ ప్లానెల్స్ పెట్టుకునే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా బిహార్ రాష్ట్రానికి పలు వరాల ఝల్లు కురిపించారు. బిహార్ కు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కేటాయించడంతో పాటు తెలంగాణలో పసుపు బోర్డు తరహాలో అక్కడ మకానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో ఎక్కువ మకానా అక్కడే పండుతూ ఉండటంతో అక్కడే ఈ బోర్డ్ ఏర్పాటు చేయడం విశేషం.
ఈ బడ్జెట్ లో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు ఇచ్చారు.MSMEలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రాల సహకారంతో ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన ప్రకటించిన నిర్మల.ధన్‌ధాన్య యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చూకూరనుంది. దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహాకాలు అందించనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో నగరాల్లో గోదాములు,నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన చేయనున్నారు.పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం.కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఒప్పందం ద్వారా ప్రజలకు 100 శాతం కుళాయి నీళ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. బొమ్మల తయారీలో భారత్ ను ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా నిలిచే కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు. రూ. 25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ బోర్డ్ ఏర్పాటు. పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ కార్మికుల కోసం హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా 75 వేల మెడికల్ కాలేజీ సీట్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.