/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

 

Guava Fruit Benefits: జామ పండులో శరీరానికి కావాల్సిన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో  విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే ఇందులో విటమిన్ సి కూడా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంచి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జామలో ఫైబర్‌ కూడా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు, మలబద్దకాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జామ పండు తినడం వల్ల కలిగే ప్రధాన లాభాలు:
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: 

జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి.. జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జామలో ఉండే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి.

జీర్ణ వ్యవస్థకు మేలు: 
జామలో ఫైబర్ పుష్కలంగా  ఉంటుంది. కాబట్టి రోజు ఉదయాన్నే తినండ వల్ల మలబద్ధకం సమస్యల నంచి విముక్తి కలిగిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జామలో ఉండే ఇతర పోషకాలు కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు
జామలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అదేవిధంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జామలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: 
జామలో ఉండే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మధుమేహం ఉన్నవారికి జామ చాలా బాగా పని చేస్తుంది. జామలో ఉండే క్రోమియం కూడా చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నిరోధక శక్తి: 
జామలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి మేలు: 
జామలో విటమిన్ సి చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. జామలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా చర్మం ఎర్రబడటం, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

కళ్ల ఆరోగ్యానికి మేలు: 
జామలో విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. జామలో ఉండే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కంటి క్యాటరాక్ట్, మాక్యులర్ డిజీజ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Guava Fruit Benefits: Know 7 Amazing Benefits Of Eating Guava Fruit In Morning DH
News Source: 
Home Title: 

Guava Fruit Benefits: ఉదయాన్నే జామ పండు తింటున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి!

Guava Fruit Benefits: ఉదయాన్నే జామ పండు తింటున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి!
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఉదయాన్నే జామ పండు తింటున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Wednesday, August 14, 2024 - 13:35
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
14
Is Breaking News: 
No
Word Count: 
338