Nuvve Kavali Song: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'నువ్వే కావాలి' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ..

Nuvve Kavali Song: మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన  యూత్ ఫుల్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'నువ్వే కావాలి' లాంచ్ ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు.  భార్గవ్ రవడ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు. ఈ  పాటకు మనీష్ కుమార్ సంగీతం అందించి ఆలపించగా, వైషు మాయతో కలిసి పాడిన ఈ యుగళ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 25, 2025, 08:30 PM IST
Nuvve Kavali Song: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'నువ్వే కావాలి' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ..

Nuvve Kavali Song: బాలీవుడ్ లో ఎక్కువగా ఉండే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కల్చర్ తెలుగులో కూడా ఇరగదీస్తోంది. తాజాగా విడుదలైన ఈ పాటను భార్గవ్ రవడ డైరెక్షన్ తో పాటు ఫోటోగ్రఫీ అందించారు. ఈ పాటను యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో పిక్చరైజ్ చేశారు.  ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్స్ గా  సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా,   సిరి హనుమంత్, గీతు రాయల్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక తో పాటు తెలుగు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్లు పాల్గొన్నారు.  క్రియేటివ్ హెడ్ చందు పాల్గొన్నారు.  డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసింది.

ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ .. నాకు మెహబూబ్, శ్రీ సత్య బిగ్ బాస్ ముందు నుంచే తెలుసు. అదే విధంగా భార్గవ్ తో నాకు ముందు నుంచే మంచి పరిచయాలున్నాయి.  ఈ సాంగ్ చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు.  ఇప్పటివరకు నేను చూసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నిట్లో ఇది బెస్ట్ అని నమ్ముతున్నాను. సుందరమైన లొకేషన్స్ లో చాలా బాగా ఈ సాంగ్ ని పిక్చరైజ్ చేశారు.  మహబూబ్ టిక్ టాక్ మొదలుపెట్టి యూట్యూబ్ వరకు ఎన్నో వీడియోస్, సాంగ్స్ కష్టపడి చేసి ఈ స్థాయికి వచ్చాడు. ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్  కంగ్రాట్స్ తెలియజేసారు.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ : మ్యూజిక్, లిరిక్స్ లో మంచి ఫీల్ ఉంది. యూరోప్ లో మంచి లొకేషన్స్ లో ఈ పాట తీసిన విధానం బాగుంది. స్క్రీన్ పై మహబూబ్ శ్రీ సత్య పెయిర్ బాగుంది. వాళ్ల కెమిస్ట్రీ కూడా బాగుంది. కచ్చితంగా ఈ సాంగ్ ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీ సత్య మాట్లాడుతూ : ఈ పాట రిలీజ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను.  ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మిత్రులను చూస్తే సంతోషంగా ఉంది.   మా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. మెహబూబ్ తో కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ కి నన్ను తీసుకున్నందుకు భార్గవ్ కి ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసే పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

మహబూబ్ మాట్లాడుతూ : నాకోసం టైం కేటాయించి అడగగానే వచ్చిన నా ఫ్రెండ్స్ సోహెల్, నోయల్, విక్కీ, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, ప్రియాంక ఇలా వచ్చిన  అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని ప్రశంసిస్తున్నారు. అడగగానే ఈవెంట్ ని హోస్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన స్రవంతి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈవెంట్ ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ఈ స్వామిని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News