Big Crocodile: వామ్మో.. ఇంట్లోకి దూరిన 12 అడుగుల భారీ మొసలి.. అధికారులకు ముప్పుతిప్పలు.. వీడియో వైరల్..

Crocodile enters home: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జానంపేట్ గ్రామంలో ఇంట్లో భారీ మొసలిని కుటుంబ సభ్యులు చూసి షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 7, 2024, 01:43 PM IST
  • మొసలికి చుక్కలు చూపించిన కుక్కలు..
  • సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్టు సిబ్బంది..
Big Crocodile: వామ్మో.. ఇంట్లోకి దూరిన 12 అడుగుల భారీ మొసలి.. అధికారులకు ముప్పుతిప్పలు.. వీడియో వైరల్..

Crocodile enters in a house in janampet village wanaparthy video: కొన్నిరోజులుగా అనేక ప్రాంతాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులు, ప్రాజెక్టులు, నదులు నిండుకుండలుగా మారాయి.  ఎక్కడ చూసిన ప్రాజెక్టులన్ని గేట్లు ఓపెన్ చేస్తున్నారు. మరోవైపు నదులలో కొన్ని చోట్ల మొసళ్లు కూడా భారీగానే కన్పిస్తున్నాయి. అవి నదీ ప్రవాహానికి కొట్టుకుని వస్తున్నాయి. సాధారణంగా వర్షాలు పడినప్పుడు ఎక్కువగా పాములు, కొండ చిలువలు మన ఇంటికి రావడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక భారీ మొసలి దారి తప్పి జనావాసాల్లోకి ప్రవేశించింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE Telugu News (@zeetelugunews)

ఇది వరకు కూడా మొసళ్లు కొన్నిసార్లు రోడ్ల మీదకు వచ్చి హల్ చల్ చేశారు. మరికొన్నిసార్లు నదుల దగ్గర స్నానాలకోసం వెళ్లిన వారిపైదాడులు సైతం చేశాయి. ఇలాంటి అనేక ఘటనలు గతంలో వార్తలలో నిలిచినాయి. తాజాగా, ఒక మొసలి ఏకంగా ఒక ఇంట్లో దూరిపోయింది. దీనికి సంబంధించిన వీడియోప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

వనపర్తి జిల్లా జానకంపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జానంపేట్ గ్రామంలో మంగళవారం తన ఇంట్లో బాత్‌రూమ్‌కు సమీపంలో మొసలి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే భయపడిపోయిన అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే ఆ ప్రదేశానికి అటవీ సిబ్బంది చేరుకున్నారు. భారీ మొసలిని పట్టుకొవడానికి ప్రయత్నించారు. దాదాపుగా ఐదుగంటల పాటు.. రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం అటవీశాఖ అధికారులు సాగర్‌ స్నేక్‌ సొసైటీ వాలంటీర్లతో కలిసి మొసలిని బంధించారు.

ఆ తర్వాత అక్కడ దగ్గరలో.. బీచుపల్లి వద్ద కృష్ణానదిలోకి వదిలారు. ఇదిలా ఉండగా.. తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు పదే పదే మొరుగడంతో విసుగు చెందిన ఇంటి యజమాని నాగన్న నిద్రలేచాడు. వీధికుక్కలు అరుపులు ఉన్నవైపుకు వెళ్లాడు. అక్కడ భారీ మొసలి కన్పించింది. ఆ మొసలి సమీపంలోని రామసముద్రం వాగు నుంచి ఇంట్లోకి ప్రవేశించిన మొసలిని గమనించాడు.

Read more: Snake video: పామును కాపాడుతుండగా షాకింగ్ ఘటన.. చెయ్యిపై కసితీరా కాటేసిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

వెంటనే ఇంటి యజమాని 108కి డయల్ చేసి అటవీశాఖ అధికారులు, సాగర్ స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. బీట్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ అప్రమత్తం కావడంతో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణసాగర్‌ నేతృత్వంలోని వాలంటీర్ల బృందం, అటవీశాఖ అధికారులు నాగన్న ఇంటికి చేరుకుని మొసలిని కాపాడారు. మొసలి దాదాపుగా.. 12 అడుగులు ఉంటుదని కూడా సమాచారం. మొసలిని బంధించడంతో అక్కడివారు ఊపిరిపీల్చుకున్నారు. 

 

Trending News