Cat Viral Video: స్పైడర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి పక్షిని పట్టుకున్న పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో..

Cat Viral Video: పిల్లి గాల్లోకి ఎగిరి పక్షిని పట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి మరి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 04:23 PM IST
  • పిల్లి, పక్షుల మధ్య ఫైట్
  • వైరల్ అవుతున్న వీడియో
Cat Viral Video: స్పైడర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి పక్షిని పట్టుకున్న పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో..

Cat Viral Video: సోషల్ మీడియాలో (Social Media) రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట  తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తే.. మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మనందరికీ పిల్లులు గురించి బాగా తెలుసు. ఎందుకంటే వీటిని మనం ఇంట్లో పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటాం. ఇవి సాధారణంగా ఎలుకల్ని వేటాడి చంపి తింటూ ఉంటాయి. కానీ ఓ పిల్లి మాత్రం స్పైడర్ మ్యాన్ లో గాల్లో ఎగిరి.. ఓ పక్షిని పట్టుకుని తినడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి మరి.

వీడియో ఓపెన్ చేస్తే...  ఓ ఇంటి దగ్గర గార్డెన్లో కొన్ని పక్షులు ఎగురుతూ ఉంటాయి. వీటిని ఎంతో నిశితంగా గమనిస్తూ ఉంటుంది పిల్లి. సడన్ గా గాల్లోకి ఎగిరి ఓ పక్షిని అమాంతం నోటితో పట్టుకుంటుంది. దానిని తినబోతుండగా..ఇంతలో ఆ పక్షి యెుక్క సహచర పక్షులు అక్కడికి వచ్చి పిల్లిపై దాడి  చేస్తాయి. వెంటనే పిల్లి తోక ముడిచి అక్కడి నుంచి పారిపోతుంది. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో meowcat_happypet అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేయబడింది. 

Also Read: Cobra Viral Video: నీ ధైర్యానికి ఓ హ్యాట్సాఫ్ బాసూ.. అంత పెద్ద పామును సునాయాసంగా పట్టుకున్నాడుగా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News