kid narrowly escaped from road accident video: సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బైటకు వెళ్లినప్పుడు, స్కూళ్లకు తీసుకెళ్లేటప్పుడు, ఎక్కడికి కైన బైటకు తీసుకెళ్లేటప్పుడు వారిని ఒక కంట కనిపెడుతునే ఉండాలి. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్న కూడా నిండు ప్రాణాలు డెంజర్ లో పడిపోతాయి. ఇటీవల కాలంలో చాలా మంది తమ పిల్లల్ని సరిగ్గా పట్టించుకొరు. ముఖ్యంగా బైటకు వస్తే.. తమ ఫోన్ లలోనే కాలంగడిపేస్తుంటారు. వీడియోలు, రీల్స్ లలోనే బిజీగా ఉంటారు. అంతే కాకుండా.. ఇతరులతో బాతాకానీలు కొడుతుంటారు.
అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు...!
పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశం ఉందంటూ 'ఎక్స్' వేదికగా ఓ వీడియో షేర్ చేసిన సజ్జనార్ pic.twitter.com/4S6zjsg737
— BIG TV Breaking News (@bigtvtelugu) February 17, 2025
అయితే. ఆర్టీసీ ఎండీ సజ్జనాల్ తాజాగా.. తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఆయన ఆ బుడ్డొడికి ఎంతో లక్ ఉందని కూడా కామెంట్లు జతపర్చాచు. ఈ వీడియోలో.. ఒక తండ్రి తన బిడ్డతో బైక్ మీద ఉన్నారు. అప్పుడే ఇంట్లో నుంచి మరో బిడ్డ పరుగెత్తు కుంటు వచ్చాడు. వీరి ఇల్లు కాస్తంత రోడ్ కు దగ్గరగా ఉంది. అదే సమయంలో వెనుక నుంచి డీసీఎం వేగంగా వచ్చింది.
ఇంతలో పిల్లాడు.. రోడ్డుమీదకు పరిగెత్తి.. మరల ఇంటివైపు తిరిగాడు. అప్పుడు డీసీఎం వాడు.. వెంట్రుక వాసిలో స్టిరింగ్ మరోవైపు తిప్పేశాడు. తండ్రి... కొడుకును రెప్పపాటులో కాపాడేందుకు ట్రై చేశారు. భయంతో వెనక్కుచూశాడు. మరీ అతనికి ఇంకా లక్ బాగా ఉన్నట్లుంది.
అతను పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాడు. అప్పుడు తండ్రి వెంటనే బైక్ నుంచిదిగి.. దేవుడు పెద్ద గండం నుంచి బైటపడేశాడని ఊపిరీ పీల్చుకున్నాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీన్ని తన అకౌంట్లో మళ్లీ పోస్ట్ చేసి.. బుడ్డొడు వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి బైటపడ్డాడు. అందరికి ఇలాంటి లక్ ఉండకపొవచ్చని కామెంట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter