Lord Vishnu Puja Tips: దేవుడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తులు...కష్టాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. విష్ణువు (Lord Vishnu) అనుగ్రహం పొందితే.. తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్లే. శ్రీహరిని రోజూ పూజించడం వల్ల మీ కష్టాలు దూరమవుతాయి. సంపదలతోపాటు సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయి. శ్రీమన్నారాయణుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఆరాధించటం వల్ల వారు కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరుతాయని మత విశ్వాసం. ఏ మంత్రాల (Vishnu Mantra Jaap) ద్వారా పూజిస్తే విష్ణువు అనుగ్రహిస్తాడో ఇప్పుడు చూద్దాం.
ఈ విష్ణు మంత్రాలను క్రమం తప్పకుండా జపించండి
విష్ణువు యొక్క ముఖ్య మంత్రం: ఓం నమోః భగవతే వాసుదేవాయ ||
>>శాస్త్రాల ప్రకారం, ఇది విష్ణువు యొక్క మూల మంత్రం. శ్రీహరి అనుగ్రహం పొందాలంటే.. ఈ మంత్రాన్ని పూర్తి భక్తితో హృదయపూర్వకంగా జపించాలి.
డబ్బు సంపాదించడానికి విష్ణు మంత్రం:
ఓం భూరిద భూరి దేహిన్, మా దభ్రం భూర్య భర్. భూరి ఘేదీంద్ర దిట్సీ.
భూరిద త్యసి శ్రుత: పురుత్ర శూర్ వ్రతాన్. ఆ నో భజస్వ రాధాసి..
>> ఒక వ్యక్తి ఆర్థిక సంక్షోభం లేదా డబ్బు మరియు ధాన్యాల కొరతతో బాధపడుతుంటే, పూజ సమయంలో క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
విష్ణు గాయత్రీ మంత్రం:
ఓం నారాయణ విద్మహే.
వాసుదేవాయా దీమహి.
తన్నో విష్ణు ప్రచోదయాత్.
>>విష్ణువు యొక్క ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని దుఃఖాలను తొలగిస్తాడు.
సుదర్శన చక్ర సాధన మంత్రం:
ఓం హ్రీం కార్తవీర్యార్జునో నామ రాజు బహు సహస్త్రవాన్ ।
యస్య స్మేరేణ మారేణ హ్రతం నిష్టం చ లభ్యతే ॥
>> సుదర్శన చక్ర సాధన మంత్రం జపించడం ద్వారా విష్ణువు ఆశీర్వాదం మీకు దక్కుతుంది.
విష్ణు కృష్ణ అవతార మంత్రం:
శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారే.
హే నాథ్ నారాయణ్ వాసుదేవ.
>> మతపరంగా, ఈ మంత్రం శ్రీ కృష్ణుని స్తుతి కోసం జపిస్తారు. కృష్ణ జన్మాష్టమి మరియు శ్రీ కృష్ణుని ఆరాధన సమయంలో ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. ఈ మంత్రం మనస్సుకు శాంతిని ఇవ్వడమే కాకుండా, అన్ని దుఃఖాలను నాశనం చేస్తుంది.
Also Read: Budh Vakri 2022: బుధుడి తిరోగమనం.. ఈ 3 రాశులవారికి అద్భుతమైన వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook