Astro tips for money: కొంతమంది నిరుపేద కుటుంబంలో జన్మించిప్పటికి కూడా వారు ఉన్నతస్థాయికి ఎదుగుతారు. వారు ఉన్నతస్థాయికి చేరడానికి కారణం కృషి, పట్టుదల. ఎంతో కొంత అదృష్టం కూడా తోడై ఉంటుంది. అయితే ఇలాంటి వారిపై లక్ష్మీదేవి (Lakshmidevi) కృప ఎప్పుడూ ఉంటుంది. అయితే కొన్ని రాశులవారిపై మహాలక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని ప్రభావంతో ఈ రాశివారి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. లగ్జరీగా బతుకుతారు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. అంతేకాకుండా భారీ మెుత్తంలో డబ్బును కూడబెడతారు.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు తమ అదృష్టం, శ్రమ కారణంగా చాలా డబ్బు సంపాదిస్తారు. వీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశివారికి జీవితంలో దేనికీ లోటు ఉండదు.
సింహం (Leo): సింహ రాశికి సూర్యుడు అధిపతి. సూర్యుని ప్రభావం వల్ల ఈ రాశివారికి ఆత్మ విశ్వాసం మెుండుగా ఉంటుంది. ఈ రాశివారు మంచి నాయకులు అవుతారు. అంతేకాకుండా అపారమైన డబ్బును సంపాదిస్తారు.
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. దీనివల్ల ఈ రాశివారు ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. కాబట్టి వారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు. వీరు శ్రమ, తెలివితేటల కారణంగా అనతికాలంలో ధనవంతులుగా మారుతారు. అంతేకాకుండా సకల సౌఖ్యాలను అనుభవిస్తారు.
ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. గురుడిని శుభ గ్రహంగా భావిస్తారు. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వీరిని అదృష్టం వరిస్తుంది. దీని సహాయంతో బోలెడంత డబ్బు సంపాదిస్తారు.
Also Read: Vastu Tips: ఇంట్లో నెమలి పించాన్ని ఏ దిశలో ఉంచాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook