Lunar Eclipse 2023: చివరి చంద్ర గ్రహణం సమయం, తేదీ ఎప్పుడు, సూతక కాలం ఉంటుందా

Lunar Eclipse 2023: త్వరలోనే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అదే ఈ ఏడాది చివరి, రెండవ చంద్ర గ్రహణం. సూపర్ బ్లూమూన్‌తో ఈసారి రక్షాబంధన్ ప్రత్యేకమైందిగా మారింది. ఇప్పుడు చంద్ర గ్రహణం సమయం, సూతక కాలం ఎప్పుడనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 31, 2023, 07:39 AM IST
Lunar Eclipse 2023: చివరి చంద్ర గ్రహణం సమయం, తేదీ ఎప్పుడు, సూతక కాలం ఉంటుందా

Lunar Eclipse 2023: దాదాపు రెండు నెలల తరువాత చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం మే 5వ తేదీన ఏర్పడగా రెండవది అక్టోబర్ 29న ఏర్పడనుంది. ఇదే ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం. ఈ క్రమంలో చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈ ఏడాది చంద్రునికి సంబంధించి కీలక పరిణామాలు జరిగాయి. మే 5వ తేదీన మొదటి చంద్ర గ్రహణం ఏర్పడగా అక్టోబర్ 29న రెండవ, చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇక రక్షాబంధన్ రోజున సూపర్ బ్లూమూన్ ఏర్పడటం మరో విశేషం. అంటే ఒకే ఏడాదిలో చంద్రునికి సంబంధించి మూడు ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈసారి ఏర్పడనున్న చంద్ర గ్రహణం సమయం ఎప్పుడు, సూతక కాలం ఉంటుందా లేదా అనే వివరాలు తెలుసుకుందాం.

ఖగోళ శాస్ట్రవేత్తల ప్రకారం ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 5న ఏర్పడింది. రెండవ చంద్ర గ్రహణం ఆరు నెలల తరువాత ఉంటుంది. ఈ చంద్ర గ్రహణం అర్ధరాత్రి దాటాక 1.06 గంటలకు ప్రారంభమై 2.22 గంటలకు అంతమౌతుంది. ఈ చంద్ర గ్రహణం ప్రభావం జోతిష్యపరంగా గణనీయంగా ఉంటుందంటున్నారు. జీవితంలోని పరిణామాలపై ప్రభావం చూపిస్తుంది.

ఇది ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం. ఈ చంద్ర గ్రహణం మేష రాశిలో అశ్వినీ నక్షత్రంలో ఏర్పడనుంది. అందుకే ఇండియాలో ఈ రాశి, ఈ నక్షత్రం అంటే మేష రాశి, అశ్వినీ నక్షత్రం జాతకులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ చంద్ర గ్రహణం ఇండియాలో కూడా కన్పిస్తుంది. అందుకే గ్రహణం సూతక కాలం ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇండియాలో ఈ చంద్ర గ్రహణం సూతక కాలం అక్టోబర్ 28వ తేదీ మద్యాహ్నం2 గంటల 52 నిమిషాలకు ప్రారంభమౌతుంది. గ్రహణం పూర్తి కాగానే సూతక కాలం కూడా ముగుస్తుంది. 

అనంత విశ్వంలో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే..చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఏడాదిలో రెండుసార్లు భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే మార్గంలో వస్తాయి,. ఫలితంగా సూర్యుడి వెలుగు చంద్రుడిపై ప్రసరించదు. దాంతో భూమి నుంచి చంద్రుడు కన్పించదు. భూమి, సూర్యుడు తమ కక్ష్య మారితే సూర్యుడి వెలుగు చంద్రుడిపై పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాల సమయంలో ఏ విధమైన శుభ కార్యం తలపెట్టరు. గుడులు కూడా మూసివేస్తుంటారు. ఈసారి చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించనుండటంతో ఇక్కడ కూడా సూతక కాలం వర్తింపచేయనున్నారు. 

Also read: Venus-Mercury transit 2023: బుధ, శుక్ర గ్రహాల గోచారంతో ఈ 4 రాశులకు సెప్టెంబర్ నెలంతా పట్టిందల్లా బంగారమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News