March 2023 Rashifal: ఆస్ట్రాలజీలో మార్చి నెలకు చాలా ప్రత్యేకత ఉంది. హోలీ, చైత్ర నవరాత్రి వంటి ముఖ్యమైన పండుగలు ఈనెలలోనే వస్తాయి. మార్చి నెలలోనే బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు సూర్యుడు వంటి ముఖ్యమైన గ్రహాల సంచారం జరగనుంది. ఈ గ్రహాల రాశి మార్పులు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మార్చి నెల ఈ రాశులకు శుభప్రదం
వృషభం: మార్చిలో వృషభ రాశి వారు తమ కెరీర్‌కు సంబంధించి కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
కన్య: ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. ధనలాభం ఉంటుంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. లవ్ లైవ్ బాగుంటుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు.
తుల రాశి: తుల రాశి వారు మార్చి ప్రారంభంలోనే తమ కెరీర్లో మంచి విజయాలు సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ప్రేమ లేదా వైవాహిక జీవితం బాగుంటుంది. మీ పనిపై శ్రద్ధ వహించండి.
ధనుస్సు: ధనుస్సు రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీరు ఈనెలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు.
Also Read: Shani budh yuti 2023: మూడు దశాబ్దాల తర్వాత గొప్ప కలయిక.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.