Singh Sankranti 2022: ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తాడు. సూర్యభగవానుడు రాశి మార్చడాన్నే సంక్రాంతి అంటారు. సూర్యదేవుడు సంవత్సరం మెుత్తం మీద నెలకొకరాశి చొప్పున మెుత్తం 12 రాశులలో సంచరిస్తారు. ఇవాళ అంటే ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలో సంచరించారు. దీనినే సింహం సంక్రాంతి లేదా సింగ్ సంక్రాంతి లేదా నెయ్యి సంక్రాంతి అని పిలుస్తారు. సింహరాశిలో సూర్యుడు వచ్చే నెల 17వరకు ఉంటాడు. ఈ రోజున నెయ్యికి విశిష్ట ప్రాధాన్యత ఉంది.
సింగం సంక్రాంతి ప్రాముఖ్యత
హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం ఆరో నెల, చాతుర్మాసం ప్రకారం ఇది రెండో నెల. ఈ మాసంలో సింగ్ సంక్రాంతికి (Singh Sankranti 2022) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్నానం, దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున సూర్యభగవానుడితోపాటు విష్ణువును పూజించడం శుభప్రదం.
ఈ రోజున నెయ్యి ఎందుకు తినాలి?
సింగ్ సంక్రాంతి రోజున నెయ్యికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఆవు నెయ్యి తినడం శుభప్రదంగా భావిస్తారు. చరక సంహిత ప్రకారం, ఈ రోజున నెయ్యి తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జాతకంలోని రాహు-కేతు దోషాల నుండి విముక్తి లభిస్తుంది.
Also Read: Planetary changes 2022: రానున్న 140 రోజులుపాటు ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook