Gautham Gambhir: భారత ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్‌పై ఆరోపణలు మాత్రం సరికాదు: గంభీర్‌

Gautam Gambhir said Unfair to point fingers at IPL. ఐపీఎల్ టోర్నీలో విఫలమయితే భారత ఆటగాళ్ల ప్రదర్శనను విమర్శించండని భారత మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 27, 2022, 12:37 PM IST
  • భారత ఆటగాళ్లను తిట్టండి
  • ఐపీఎల్‌పై ఆరోపణలు మాత్రం సరికాదు
  • బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది
Gautham Gambhir: భారత ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్‌పై ఆరోపణలు మాత్రం సరికాదు: గంభీర్‌

Gautam Gambhir said Unfair to point fingers at IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వలనే టీమిండియా ప్లేయర్స్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని భారత మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఐపీఎల్ టోర్నీలో విఫలమయితే భారత ఆటగాళ్ల ప్రదర్శనను విమర్శించండని, అంతేకాని ఐపీఎల్‌పై ఆరోపణలు మాత్రం సరికాదన్నారు. భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చిన ఐపీఎల్ లీగ్‌పై ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని గౌతీ చెప్పారు. 

ఎఫ్‌ఐసీసీఐ, ప్రధాన క్రీడల విభాగం ఛైర్‌పర్సన్‌ సన్‌జోగ్‌ గుప్తా చేతుల మీదుగా శనివారం గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గౌతీ మాట్లాడుతూ... 'ఐపీఎల్ రాకతో మన దేశంలో క్రికెట్‌కు గొప్ప మేలు జరిగింది. ఐపీఎల్ ప్రారంభమైన సమయం నుంచే దీనిపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఐసీసీ టోర్నమెంట్లలో బాగా ఆడలేకపోతే అందుకు బాధ్యులను చేయాల్సింది భారత ఆటగాళ్లను, వారి ప్రదర్శనను. అంతేకాని ఐపీఎల్ లీగ్‌పై ఆరోపణలు చేయడం సరికాదు. ఓ ప్లేయర్ 35-36 ఏళ్ల వయసు వరకే సంపాదించగలడు. వారికి ఆర్థిక భరోసా కల్పించడం కూడా ముఖ్యం. అది ఐపీఎల్ కారణంగా తీరుతుంది. ఎంతో మంది ప్లేయర్స్ ఆర్ధికంగా స్థిరపడ్డారు' అని అన్నారు. 

'ప్రస్తుతం టీమిండియాలో భారత కోచ్‌లకు ప్రాధాన్యం ఇస్తూ బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు కోచ్‌గా భారతీయుడే ఉండాలని నేను కూడా బలంగా కోరుకుంటా. ఎందుకంటే క్రికెట్ ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. దానిని అనుభూతి చెందిన వారే జట్టును సమర్థంగా నడిపించగలరు. ఐపీఎల్ లీగ్‌లో అన్ని జట్లకు భారతీయ కోచ్‌లే ఉండటం నేను చూడాలనుకుంటున్నా. మనం విదేశీ కోచ్‌లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. కానీ వారు డబ్బులు సంపాదించుకోవడానికే ఇక్కడకు వస్తారు. మనోళ్లకు బిగ్‌ బాష్‌ వంటి ఇతర విదేశీ లీగ్‌ల్లో కోచ్‌ బాధ్యతలు అప్పగించరు. మనవారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి' అని గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నారు.

Also Read: Minister KTR: మంత్రి కేటీఆర్ పరువు తీసిన ఎమ్మెల్యే.. సాయంత్రానికి మారిపోయిన సీన్  

Also Read: Coronavirus Cases: మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నగరాల్లో లాక్‌డౌన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News