Jasprit Bumrah Record: టీమ్ ఇండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రికార్డులతో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర తిరగరాశాడు. ఆ రికార్డు వివరాలు ఇలా
ఇంగ్లండ్ వర్సెస్ టీమ్ ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. అది కూడా ఒకే ఒక్కడు రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంగ్లండ్-ఇండియా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ గత ఏడాది జరిగింది. ఇందులో 5వ టెస్ట్ మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ టెస్ట్ ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర సృష్టించాడు.
ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకూ 23 వికెట్లతో ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఏకైక ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. దాదాపు 40 ఏళ్ల క్రితం 1981-82లో ఇదే ఇంగ్లండ్‌పై కపిల్ దేవ్ 22 వికెట్లు సాధించాడు. కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేయడం విశేషం. మొన్నటి వరకూ కపిల్ దేవ్ తరువాత రెండవస్థానంలో 19 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ 3వ స్థానంలో నిలిచాడు. ఇక తరువాతి స్థానాల్లో 2007లో జహీర్ ఖాన్ 18 వికెట్లు, 2018లో ఇషాంత్ శర్మ 18 వికెట్లు సాధించారు.
అయితే ఈసారి జస్‌ప్రీత్ బుమ్రా కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రికార్డు సాధించాడు. ఇదే టెస్ట్ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో అత్యధికంగా 35 పరుగులు సాధించి కొత్త చరిత్ర నమోదు చేశాడు.
Also read: ENG vs IND 5th Test: టీమిండియాదే బ్యాటింగ్.. తెలుగు ఆటగాడికి చోటు! ఓపెనర్లు ఎవరంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.