భారత జట్టులో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అజింక్య రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే అని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్టు సిరీస్ సాధించాలంటే ఇదే మంచి అవకాశమని భారత టెస్ట్ బ్యాటర్ చేటేశ్వర్ పుజారా అన్నాడు. భారత జట్టు ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చేస్తుందని.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి విదేశీ పిచ్‌లపై విజయాలు సాదించిందన్నాడు.
సుదీర్ఘమైన ఫార్మాట్లో టీమిండియా వరుస విజయాల వెనుక టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు మాజీ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉందని చెప్పాడు.
రవీంద్ర జడేజా బుధవారం తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేశాడు. 'లాంగ్ వే టూ గో (ఇంకా చాలా ఆడాల్సి ఉంది)' అని ఫొటోకు కాప్షన్ ఇచ్చాడు.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ ఖండించడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గంగూలీపై ఒకవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తూనే.. మరోవైపు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. అంతేకాదు టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు.
BCCI vs Virat Kohli: బీసీసీఐకు టీమ్ ఇండియా మేటి క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య దూరం పెరుగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటన గురించి..బీసీసీఐకు నేరుగా సమాధానమిచ్చాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డేలు ఆడడని వచ్చిన వార్తలను బీసీసీఐ అధికారి తోసిపుచ్చారు. కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడా? అని అడగ్గా.. 'తప్పకుండా.. కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడు' అని తెలిపారు.
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయని సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు మంగళవారం ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన రోహిత్ శర్మ వన్డే సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించి.. రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీంతో కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి స్పందన ఏంటి అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ కెప్టెన్సీ గురించి రోహిత్ స్పందించాడు.
కెప్టెన్సీ తొలగింపు విరాట్ కోహ్లీపై ఎలాంటి ప్రభావం చూపదని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. రానున్న మ్యాచులలో కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని ఉన్నపళంగా ఎందుకు తప్పించాల్సి వచ్చిందో తెలిపారు.
విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం ఒక విధంగా మంచిదే అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ భారం లేకపోవడంతో.. విరాట్ బ్యాటర్‌గా రాణించే అవకాశం ఉందని అంచనా వేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన వెంకటేశ్ అయ్యర్.. ఆ శతకంను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు అంకితం చేశాడు. చిన్నప్పటినుంచి రజనీకి వీరాభిమాని అయిన వెంకీ.. శతకం అనంతరం సూపర్ స్టార్ స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు.
Sourav Ganguly: టీమ్ ఇండియా క్రికెట్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20తో పాటు వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.