Eetala Rajender Demands For MSP: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మామిడి రైతుల కోసం చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మామిడి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Farmers Loans Waiver: రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఇప్పటికే రైతు బీమా, రైతు బంధు పథకంతో పాటు రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోన్న తెలంగాణ సర్కారు తాజాగా రూ. 99,999 లోపు రుణాలు ఉన్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు విడుదల కాగా ఇక రైతుల రుణ ఖాతాల్లో జమ కావడమే మిగిలి ఉంది.
Farmers Loan Waiver: కరోనా సమయంలోనూ రైతుల కోసం తమ సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించారని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
Independence Day 2023 Guests: ఆగస్టు 15 నాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట పై జాతీయ జండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి కీలకమైన ఉపన్యాసం చేస్తారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను, మహనీయులను స్మరించుకుంటూ సాగే ఆ ప్రసంగంలో స్వాతంత్ర్యం అనంతరం మన దేశం సాధించిన ప్రగతిని కూడా వివరిస్తారు. అంతటి కీలకమైన మన పంద్రాగస్టు పండగని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Food Processing Units In Telangana: తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.
KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
Rythu Bandhu Scheme June installment Will be Credited by Today: రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ చేయాల్సిందిగా స్పష్టంచేస్తూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
Rythu Bandhu Scheme 2023 June: రైతు బంధు పథకం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం విడుదలకు తేదీ ఖరారైంది. రైతు బంధు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారితో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు...
AP CM YS Jagan: అమరావతి: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్.. రాబోయే కాలంలో ఇదే 4G సేవలను 5G కి అప్‌గ్రేడ్ చేయనున్నట్టు స్పష్టంచేశారు.
PM KISAN Yojana Next Installment Money: రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం సన్నకారు రైతులు ఎదురుచూస్తున్న సమయం ఇది. ఈ పథకం కింద కేంద్రం ప్రతీ ఏడాది ఒక్క రైతుకు ఒక్కో విడతకు రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ.6000 అందిస్తోన్న సంగతి తెలిసిందే.
Fake Seeds Alert Farmers : నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి వారి నుంచి 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 2 ముఠాలకు చెందిన పదిహేను మంది నిందితులను టాస్క్‌ఫోర్స్, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ విభాగం అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.
Chukkala Bhoomulu Rights in AP: అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Pawan Kalyan Press Meet: రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది." అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Dhulipala Narendra : ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని అన్నారు. తక్షణమే అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని అన్నారు.
TSRTC Chairman Bajireddy Govardhan: ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలని టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బండి సంజయ్‌కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.