VIVO V50: అత్యంత స్లిమ్ ఫోన్ వచ్చేసింది, కెమేరా అయితే సినిమాలే తీయవచ్చు

VIVO V50 Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. దేశంలోనే అత్యంత స్లిమ్ ప్రీమియం ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి, ధర ఎంత అనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2025, 03:12 PM IST
VIVO V50: అత్యంత స్లిమ్ ఫోన్ వచ్చేసింది, కెమేరా అయితే సినిమాలే తీయవచ్చు

VIVO V50 Launch: ఇండియాలోనే అత్యంత స్లిమ్ డిజైన్ ఫోన్ వివో లాంచ్ చేసింది. బ్యాటరీ, కెమేరా ఇలా అన్నింటిలో ఈ ఫోన్ చాలా ప్రత్యేకం. VIVO V50 పేరుతో ఇవాళ ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ మార్కెట్‌లో సంచలనం రేపుతుందనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాది చైనాలో లాంచ్ అయిన VIVO S20కు రీ బ్రాండెడ్ వెర్షన్ ఇది. ఇందులో అన్నీ ఆడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. 

ఇండియాలో వివో స్మార్ట్‌ఫోన్లకు క్రేజ్ ఎక్కువ. ఇప్పుడు మరో కొత్త స్మార్ట్‌ఫోన్ VIVO V50 ఇవాళే లాంచ్ అయింది. దేశంలో అత్యంత స్లిమ్ డిజైన్ ఫోన్ ఇది. ఈ ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ ఎమోల్డ్ స్క్రీన్, హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఇక బ్రేకేజ్ నుంచి రక్షణ కోసం డైమండ్ షీల్డ్ గ్రాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే కింద పడిపోయినా డ్యామేజ్ ముప్పు చాలా తక్కువ. ఇందులో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక స్టోరేజ్ అయితే 128 జీబీ నుంచి 512 జీబీ వరకు ఉంటుంది. 8జీబీ, 12 జీబీ ర్యామ్ సామర్ధ్యంతో పనిచేస్తుంది. 

VIVO V50లో కెమేరా చాలా అధునాతనమైంది. ZEISS కంపెనీతో కలిసి మూడు కెమేరా లెన్స్ ఉన్నాయి. పోర్ట్రెయిట్ పిక్స్ కోసం ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, ఆటోఫోకస్‌తో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇవి 4కే వీడియో రికార్డింగ్ చేస్తాయి. దీంతోపాటు 92 డిగ్రీలు ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. 

ఈ ఫోన్ 9 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. యాంటీ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్, అధునాతన కెమేరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో చాలా ప్రత్యేకంగా ఉండనుంది. 

VIVO V50 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 34,999 రూపాయలు కాగా 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 36,999 రూపాయలు ఉంది. ఇక 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 40,999 రూపాయలుగా ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ కొనుగోలుపై TWS 3e ఇయర్ బడ్స్ ప్రత్యేక డిస్కౌంట్‌తో 1499 రూపాయలకే లభిస్తాయి. కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 

Also read: Air Asia Offer: బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు కేవలం 5 వేలకే ఫ్లైట్ టికెట్ ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News