AP Summer Effect: ఏపీలో వరుసగా రెండేళ్ల నుంచి వాతావరణంలో తీవ్ర మార్పులు కన్పిస్తున్నాయి. వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఈ ఏడాది కూడా మరోసారి వేడిగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కన్పిస్తోంది.
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మార్చ్ నుంచి వేసవి ప్రారంభం కావల్సిఉన్నా ఆ ప్రభావం ఫిబ్రవరి నుంచే కన్పిస్తోంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తే అప్పుడే వేసవి వచ్చేసిందన్పిస్తోంది. మరోవైపు ఉక్కపోత కూడా క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి. 1901 నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇప్పటి వరకు 2024 అత్యంత వేడి సంవత్సంగా నమోదైంది. సగటును 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఇక ఈ ఏడాది అదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది.
ఈ నెలలో రెండో వారం నుంచి ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 5 డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలున్నాయి. ఇక దక్షిణ భారతదేశమంతా వేడి వాతావరణ పెరగనుందని వాతావరణ శాఖ పెరుగుతోంది.కేరళలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఏపీలో రానున్న రోజుల్లో కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు రెండూ పెరగనున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం గరిష్టంగా 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, సత్యసాయి, కర్నూలు, అనంతపురం, తిరుపి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీలు ఉంటోంది.
రానున్న రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రత మరింతగా పెరగనుందని తెలుస్తోంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో మే నెలలో ఉష్ణోగ్రత 47-48 డిగ్రీలు ఉండవచ్చని అంచనా ఉంది.
Also read: Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి