/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

అమరావతి: రాఖీ పండుగ‌ ( Rakhi festival) సందర్భంగా మహిళలు, చిన్నారులకు ఏపీ సర్కార్ ప్రత్యేక కానుక అందించింది. మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాలను ( Cyber crimes ) అరికట్టే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన 'ఈ- రక్షాబంధన్‌' కార్యక్రమాన్ని ( e raksha bandhan program) ఇవాళ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఇప్ప‌టికే మ‌హిళలపై దాడులను అరికట్టడం కోసం దిశ చ‌ట్టం ( Disha act), కేసుల న‌మోదు కోసం ప్ర‌త్యేకంగా యాప్‌, మ‌హిళ‌లకు సత్వర న్యాయం అందించడం కోసం ప్ర‌త్యేక పోలీస్ స్టేష‌న్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. తాజాగా రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా 'ఈ -ర‌క్షాబంధ‌న్' కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. సైబ‌ర్ నేరగాళ్ల నుంచి మ‌హిళ‌ల‌ు, చిన్నారులకు రక్షణ కల్పించడంతో పాటు సైబ‌ర్ నేరాల‌పై మహిళాలోకానికి అవ‌గాహ‌న క‌ల్పించే లక్ష్యంతో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని రూపొందించారు. Also read: Director Teja: తేజకు కరోనా పాజిటివ్

e raksha bandhan program ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉద‌యం 11 గంటల నుంచి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అవ‌గాహ‌నా కార‌క్ర‌మాలు చేపట్టనున్నట్టు తెలిపారు. షార్ట్ ఫిలిమ్స్, యానిమేష‌న్స్, రీడింగ్ మెటీరియ‌ల్స్ ద్వారా ప్రచారం చేపట్టి దాడులను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. సైబర్ సెక్యురిటీ నిపుణులు ( Cyber security experts ) నెల రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీఎం వెల్లడించారు. Also read: Telangana: మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా

Section: 
English Title: 
AP CM YS Jaganmohan Reddy launches e raksha bandhan program for women and children
News Source: 
Home Title: 

Rakhi festival: రాఖి పౌర్ణమి నాడే మహిళలకు మరో కానుక

Rakhi festival: రాఖి పౌర్ణమి నాడే మహిళలకు మరో కానుక
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Rakhi festival: రాఖి పౌర్ణమి నాడే మహిళలకు మరో కానుక
Publish Later: 
No
Publish At: 
Monday, August 3, 2020 - 18:30