AP 10th Class Exams:కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హైకోర్టు సూచనల్ని పరిగణలో తీసుకుని ఇప్పటికే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం..త్వరలో పదవ తరగతి పరీక్షలపై పునరాలోచించనుంది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) ఉధృతి పెరుగుతున్నట్టే ఏపీలో సైతం రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. కొన్ని నిర్ణయాల్ని మార్చుకుంటోంది. కరోనా కట్టడి కోసం మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ వేళల్ని మార్చింది. ఇకపై పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనుంది. మే 5 నుంచి మద్యాహ్నం 12 గంటల్నించి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ పూర్తిగా కర్ఫ్యూ ఉంటుంది. అంటే ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకే షాపులు తెరిచుంటాయి. మరోవైపు మే 5 నుంచి ప్రారంభం కావల్సిన ఇంటర్ పరీక్షల్ని(Inter Exams postponed) వాయిదా వేసింది. హైకోర్టు సూచనలు, పిటీషనర్లు అభిప్రాయాల్ని పరిగణలో తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. తదుపరి పరీక్షల్ని ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్మయించలేదని..పరిస్థితుల్ని బట్టి తేదీ నిర్ణయిస్తామని ప్రభుత్వం ( Ap government) వెల్లడించింది.
ఇక పదవ తరగతి పరీక్షల నిర్వహణ ( Ap Tenth Exams) పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు( Ap High Court) కు తెలిపింది ప్రభుత్వం. వచ్చే మూడు వారాల్లో పరిస్థితుల్ని బట్టి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోనందున కేసు విచారణను జూన్ 2 వ తేదీకు వాయిదా వేసింది.
Also read: AP Curfew: ఏపీలో కఠిన ఆంక్షలు, మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo