Sensational Allegations by Payyavula Keshav: సౌర విద్యుత్ కోసం సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని పీఏసీ ఛైర్మన్,టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధర వెచ్చించి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.ఈ కొనుగోళ్లలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని... ఇది విద్యుత్ కొనుగోలు స్కీమ్ కాదు.. ఆదానీకి లాభం చేకూర్చేందుకు చేసే స్కామ్ అని ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లపై మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం(నవంబర్ 5) పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు.
గత నవంబర్‌లో సెకీ పిలిచిన టెండర్లలో గుజరాత్ రాష్ట్రం రూ.1.99కే ఒక యూనిట్ సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిందని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు.ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక యూనిట్‌కు రూ.2.49 వెచ్చించి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు.మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు వెచ్చించిందో చెప్పాలని ప్రశ్నించారు.
Also Read: NTR Undergoes Minor Surgery: ఎన్టీఆర్ కుడి చేతికి మైనర్ సర్జరీ.. ఫొటోలు వైరల్
సెకీ నుంచి ఆ సౌర విద్యుత్ ఏపీలోని డిస్కంలకు చేరేసరికి యూనిట్ ధర రూ.4.50 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది విద్యుత్ కొనుగోలు స్కీమ్ కాదు... అదానీ కోసం చేసే స్కామ్ అని ఆరోపించారు.నిజానికి ఏపీఈఆర్సీనే విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించాలని... కానీ ఇక్కడ అలా జరగలేదని అన్నారు.సీఎంకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అని ప్రశ్నించారు.
9వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేశామని ఏపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోందని... రూ.30వేల కోట్ల లావాదేవీలకు గంటల వ్యవధిలోనే ప్రతిపాదనలు,ఆమోదాలు ఎలా జరిగాయని పయ్యావుల ప్రశ్నించారు.మంచి,చెడు చూడకుండా గంటల వ్యవధిలోనే ఆగమేఘాల మీద ఒప్పందాలు జరగడమేంటని నిలదీశారు.రాష్ట్రంలో అదానీకి దక్కని టెండర్లను సెకీ రూపంలో వారికే కట్టబెట్టారని ఆరోపించారు. రూ.30వేల కోట్ల పెట్టుబడులను అదానీలకు నామినేషన్ పద్దతిలో ఇచ్చేశారని ఆరోపించారు.
Also Read: Sanya Malhotra: హృతిక్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న దంగల్ బ్యూటీ!
ఏపీలో 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నప్పటికీ... పక్క రాష్ట్రాలకు మేలు చేసేలా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందన్నారు.రివర్స్ టెండరింగ్ ఏమైంది... జ్యుడీషియల్ ప్రివ్యూ ఎందుకు లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలోనే సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి