Mudragada vs Jyothula Nehru: ఏపీ కాకినాడ జిల్లాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రేపో మాపో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని భావిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముద్రగడ యూ టర్న్ తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కే పరిణామం చోటుచేసుకుంది. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ హఠాత్తుగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికొచ్చిన జ్యోతుల నెహ్రూ ముద్రగడతో మాట్లాడారు. రేపో మాపో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని భావిస్తున్న ముద్రగడ పద్మనాభంతో జ్యోతుల నెహ్రూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కోసం జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. తన వారసుడి రాజకీయ భవిష్యత్, కాపు సామాజిక వర్గం ఒత్తిడి మేరకు ముద్రగడ సైతం జనసేనలో చేరే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
ముద్రగడతో బేటీ అయిన జ్యోతుల నెహ్రూ మాత్రం ఈ భేటీకు రాజకీయ, పార్టీ పరంగా ప్రాధాన్యత లేదంటున్నారు. కేవలం రానున్న ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరానని చెప్పారు. అంతేకాకుండా ఇర్రిపాకలో నిర్వహించే కోటి శివలింగార్చన పూజకు ఆహ్వానించేందుకే వచ్చానన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు ఆదేశాలతోనే జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి భేటీలో కూడా అదే జరిగినట్టు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook