Tirumala Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త... పవిత్రోత్సవాలకు దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ

Tirumala Tirupati Devasthanam: పవిత్రోత్సవాల కారణంగా నిలుపదల చేసిన రూ.300 దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 2న టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 31, 2022, 10:12 AM IST
  • శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
  • పవిత్రోత్సవాల కారణంగా నిలుపుదల చేసిన టికెట్లు విడుదల
  • ఈ నెల 2న ఆన్‌లైన్‌లో అందుబాటులో
Tirumala Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త... పవిత్రోత్సవాలకు దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 7 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు రోజుల పాటు రూ.300 దర్శన టికెట్లను నిలుపుదల చేసినట్లు టీటీడీ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. అయితే ఆ టికెట్లను ఆగస్టు 2న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తాజాగా టీటీడీ వెల్లడించింది. భక్తులు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆ టికెట్లను పొందవచ్చు.  

ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో ప్రతీ ఏటా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆలయ పవిత్రతను, పరిశుభ్రతను అవధారణ చేసేందుకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఒకరకంగా ఇది శుద్ధీకరణ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఏడాది పాటు శ్రీవారికి నిత్య పూజలు, ఉత్సవాలు, కైంకర్యాలు జరుగుతుంటాయి కాబట్టి.. మంత్రదోష, క్రియాదోష, కర్తవ్య దోషాలను తొలగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 

తిరుమల పవిత్రోత్సవాల ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. ఏకాదశినాడు పవిత్ర ప్రతిష్ఠ, ద్వాదశి నాడు పవిత్ర సమర్పణ, త్రయోదశి నాడు పూర్ణాహుతి ఉత్సవం జరుగుతుంది. మలయప్ప స్వామికి, ఉభయ దేవేరులకు పవిత్ర మాలల సమర్పణ, ఊరేగింపు కార్యక్రమంతో దోష పరిహారం పూర్తవుతుంది.

Also Read:Cash In MLA Car:కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కారులో భారీగా కరెన్సీ కట్టలు! ప్రభుత్వాన్ని పడగొట్టడానికేనా?   

Also Read: Joe Biden Covid 19: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మరోసారి కరోనా పాజిటివ్... మళ్లీ ఐసోలేషన్‌లోకి...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News