7th Pay Commission DA Hike 2024: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. మరో అదిరిపోయే వార్త తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిలిపోయిన 18 నెలల డీఏ, డీఆర్‌పై కేంద్రానికి రిక్వెస్ట్ వెళ్లింది. జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా ఉద్యోగుల తరుఫున ప్రధాని మోదీకి లేఖ రాశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల పాటు DA, DR చెల్లింపులను నిలిపివేసిందని లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.
Also Read: NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీలో దొంగతనం.. వృద్ధులకు ఇవ్వాల్సిన రూ.4 లక్షలు చోరీ
కాగా.. అంతకుముందు భారతీయ ప్రతీక్షా మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ముఖేష్ సింగ్ కూడా ఈ విషయంపై కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. 18 నెలల పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కోవిడ్ -19 మహమ్మారి ఎదుర్కొంటున్న సవాళ్లను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి మన దేశం క్రమంగా కోలుకుని.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంచిన డీఏను చెల్లించాలని కోరారు.
అయితే గతంలో పెండింగ్‌లో డీఏ, డీఆర్ చెల్లించడం కష్టమని లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో ఆర్థిక స్పిల్ ఓవర్ కారణంగా చేపట్టిన సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వడం సాధ్యం కాదని స్ఫష్టం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డీఏ బకాయిలపై ఆశలు వదులుకున్నారు. పెండింగ్ డీఏ బకాయిలను చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. ఒకేసారి భారీ మొత్తంలో ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
ఈ ఏడాది మార్చిలో కేంద్రం మొదటి డీఏను 4 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. పెంచిన డీఏను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసింది. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఉద్యోగులు జీతాల పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. రెండో డీఏ పెంపు కూడా నాలుగు శాతం ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి కేంద్రం అమలు చేయనుంది.
Also Read: Mokshagna: బిగ్ బ్రేకింగ్.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter