Zuckerberg Net Worth: మార్క్ జుకర్ బర్గ్​కు ఒక్క రోజులో రూ.2.2 లక్షల కోట్ల లాస్​!

Zuckerberg Net Worth: ప్రపంచవ్యాప్తంగ అత్యంత సంపన్నుల జాబితాలో ఫేస్​బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్​బర్గ్ స్థానం 12కు పడిపోయింది. అదానీ, అంబానీల దిగుకు చేరింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 03:07 PM IST
  • ఫేస్​బుక్ అధినేత మర్క్​ జుకర్​బర్గ్​కు షాక్​
  • రికార్డు స్థాయిలో 'మెటా' షేర్ల పతనం
  • భారీగా పడిపోయిన మార్క్​ సంపద
  • అదానీ, అంబానీల దిగువకు ర్యాంక్​
Zuckerberg Net Worth: మార్క్ జుకర్ బర్గ్​కు ఒక్క రోజులో రూ.2.2 లక్షల కోట్ల లాస్​!

Zuckerberg Net Worth: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మెటా ప్లాట్​ఫామ్స్ ఐఎన్​సీ​ (గతంలో ఫేస్​బుక్​ ఐఎన్​సీ) అధినేత మార్క్​ జుకర్​బర్గ్​కు రికార్డు స్థాయిలో నష్టం వాటిళ్లింది. ఒక్క రోజులోనే మార్క్ సంపదలో 29.8 బిలియన్ డాలర్లు (రూ.2.2 లక్షల కోట్లపైమాటే) తుడిచిపెట్టుకు పోయింది.

గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో నష్టం వాటిళ్లిన నేపథ్యంలో మార్క్ జుకర్​బర్గ్ సంపద ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లకు (రూ.6.34 లక్షల కోట్లు) తగ్గింది. దీనితో ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్​బర్గ్​ స్థానంలో 12కు పడిపోయింది.

అదానీ, అంబానీల కన్నా దిగువకు..

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఇండియాలో అత్యంత సంపన్నులైన గౌతమ్​ అదానీ, ముకేశ్ అంబానీల కన్నా దిగువకు చేరారు మార్క్​ జుకర్​బర్గ్​.

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద విలువ ప్రస్తంత 90.1 బిలియన్​ డాలర్లు (రూ.6.73 లక్షల కోట్లు).

రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 89.4 బిలియన్​ డాలర్లు (రూ.6.67 లక్షల కోట్లపైమాటే).

మార్క్ జుకర్​బర్క్​కు అంత నష్టం ఎందుకొచ్చింది?

వాల్​ స్ట్రీట్​లో మెటా స్టాక్స్​ గురువారం జీవనకాల రికార్డు పతనాన్ని నమోదు చేశాయి. నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మెటా ఫలితాలు నిరుత్సాహపరచడం, వర్చువల్​ రియాలిటీ వ్యాపారాల్లో.. రోజువారి యూజర్లు తగ్గిపోతున్నట్లు కంపెనీ ప్రకటించడం సహా ఐరోపా దేశాలు అధిక ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 'మెటావర్స్​'కు ఈ స్థాయి నష్టం వచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ కారణాలన్నింటితో గురువారం ఒక్క రోజే కంపెనీ షేర్లు 26 శాతం నష్టాన్ని నమోదు చేశాయి. దీనితో కంపెనీ మార్కెట్ విలువ కేవలం ఒక్క సెషన్​లోనే 200 బిలియన్ డాలర్లు పడిపోయింది.

దిగ్గజ కంపెనీల షేర్లన్నీ ఢమాల్​..

  • నాస్డాక్​లోయాపిల్ షేర్లు 1.67 శాతం కుప్పకూలాయి.
  • అమెజాన్​ షేర్లు భారీగా 7 శాతం నష్టపోయాయి.
  • మైక్రోసాఫ్ట్ షేర్లు 3.9 శాతం నష్టాన్ని చవిచూశాయి.
  • టెస్లా 1.6 శాతం నష్టాన్ని నమోదు చేసింది.
  • గుగూల్ మాతృసంస్థ అల్ఫాబెట్​ 3.32 శాతం పడిపోయింది.

Also read: Flipkart Electronics Sale 2022: రూ.4,500లకే శాంసంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ- ఈరోజే తుదిగడువు!

Also read: LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News