Mastan Sai: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లావణ్య..రాజ్ తరుణ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు ఈ కేసులో ప్రధమంగా ఉన్న మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు
గత కొన్ని రోజుల క్రితం లావణ్య 2.0ని చూస్తారు అంటూ తెలిపిన లావణ్య అన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పింది. అందులో భాగంగానే మస్తాన్ సాయి గుట్టు రట్టు చేసింది. ఈ మేరకు మస్తాన్ సాయి పై లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కారణంగా.. మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. ముఖ్యంగా రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి.. కారణమే మస్తాన్ సాయి అని తన ఫిర్యాదులో పేర్కొనింది.
అంతేకాదు పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు చేసింది. ప్రైవేట్ గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా లావణ్య కు చెందిన కొన్ని వీడియోలను మస్తాన్ సాయి రికార్డు చేయగా ఆ రికార్డు వీడియోలను.. పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయి హార్ట్ డిస్కో లో దాదాపు 300కు పైగా వీడియోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఒక గతంలోనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఇప్పుడు అమ్మాయిల విషయంలో కూడా అరెస్ట్ అయ్యారు. అంతేకాదు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో కూడా గతంలో ఈయన అరెస్ట్ అయ్యారు. ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబరుచుకుంటూ.. దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలను తన హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నారని తెలుస్తోంది .
ఈ హార్డ్ డిస్క్ ను సొంతం చేసుకున్న లావణ్య పోలీసులకు ఇచ్చింది. ఈ హార్డ్ డిస్క్ తనకు ఇవ్వకపోతే చంపేస్తానని ఆమెను బెదిరించినట్లు పేర్కొంది. అంతేకాదు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ అధినేత ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియో లు కూడా ఉన్నాయని సమాచారం. దీనికి తోడు నిఖిల్ ఫోన్ ని కూడా హ్యాక్ చేశాడంట మస్తాన్ సాయి.
Also Read: Baby Born: 'కలయిక' లేకుండానే సంతానం .. పిల్లలను కనాలంటే ఇకపై మహిళలు అవసరం లేదు
Also Read: West bengal: భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో జంప్ ఘటన.. వెలుగులోకి వస్తున్న నరాలు తెగే వాస్తవాలు...?..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి