Chhaava Movie 2nd day Box office Collecions: ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథపై తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘ఛావా’. ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో స్టార్ పవర్ అంతగా లేని విక్కీ కౌశల్ నటించాడు. అతని గత చిత్రాలు ఏవి మొదటి రోజు డబుల్ డిజిట్ దాటిన సందర్బాలు లేవు. కానీ చారిత్రక యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అది మొదటి రోజు వసూళ్ల రూపంలో కనిపించింది. మొత్తంగా మొదటి రోజు ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ.. రూ. 30 కోట్లకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టాయి. తాజాగా ఈ సినిమా రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది.
ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టింది హిందీ వెర్షన్ లో మన దేశంలో. మొదటి రోజు.. రూ. 33.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు శనివారం ‘ఛావా’ మూవీ రూ. 39.30 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులిపింది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 72.40 కోట్ల నెట్ వసూళ్లతో దూసుకుపోతుంది. మూడో రోజు ఆదివారం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ రోజు ఈ సినిమా దాదాపు రూ. 45 కోట్ల నెట్ వసూళ్ల నుంచి రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను హిందీలో రాబట్టే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
మొత్తంగా ఫస్ట్ వీకెండ్ లో రూ. 110 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాను కేవలం హిందీలోనే విడుదల చేశారు. మిగతా రీజనల్ లాంగ్వేజ్ అయిన తెలుగు, తమిళం,కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తే మంచి వసూళ్లే దక్కేవి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హిందీ అంతగా రానీ విజయవాడ, మచలీ పట్నం వంటి నగరాల్లో ఈ సినిమాకు మంచి బుకింగ్స్ ఉన్నాయి. ఇక వైజాగ్, హైదరాబాద్ వంటి కాస్మోపాలిటిన్ సిటీస్ లో నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపితే.. దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసేసింది. మొత్తంగా ‘ఛావా’ మూవీ బాక్సాఫీస్ దగ్గర చావా చితకొట్టేస్తోంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.