బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి వారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించిన సమయంలో వీడియో అప్‌డేట్, ఆపై కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేయడం తెలిసిందే.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భాగస్వామి కాబోతున్నారని తెలుస్తోంది. సినిమా కోసం మెగాస్టార్‌ను అడగగానే రాజమౌళికి చిరంజీవి ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే అనవసరంగా పాత్రను క్రియేట్ చేయకూడదని భావించిన జక్కన్న.. వాయిస్ ఓవర్ కోసం చిరంజీవి (Chiranjeevi lend Voice over for Rajamoulis RRR)ని అడిగి ఒప్పించారని తెలుస్తోంది.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరరణ్, గోండు ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు పాత్రలను సినిమాలో పరిచయం చేసేందుకు స్టార్ హీరో వాయిస్ ఓవర్ అవసరమని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావించింది. ఇందుకోసం రాజమౌళి అడగ్గానే చిరంజీవి మెగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సినిమాలో కనిపించకున్నా.. చిరంజీవి వాయిస్ అయినా మాకు చాలంటూ మెగా అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ నటి ఆలియాభట్, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరీస్ సందడి చేయనుంది. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, హాలీవుడ్ నుంచి ఎలిసన్ డ్యూడీ, రే స్టీవ్‌సన్, తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe