Karthika Deepam 2: అనుకున్నంత పని అయింది.. దాసు ప్రాణాలు తీయాలని తలపగులగొట్టిన జ్యోత్స్న.. ఆసుపత్రిలో శౌర్య సీరియస్..

Karthika Deepam 2 Today January 15th Episode:  జో చేసిన పనికి పారు తిడుతుంది. అయినా మొండిగానే ప్రవర్తిస్తుంది. అప్పుడే దాసు ఇంటికి వస్తాడు. నిజం చెప్పడానికి మధ్యాహ్నం నుంచి ఇంటి చుట్టు తిరుగుతున్నా అనుకుంటూ ఇంటి లోపలికి వస్తాడు. నేను సుమిత్ర వదినకు అసలు విషయం చెబుతా అని లోపలికి వెళుతుంటాడు.

Written by - Renuka Godugu | Last Updated : Jan 15, 2025, 10:07 AM IST
Karthika Deepam 2: అనుకున్నంత పని అయింది.. దాసు ప్రాణాలు తీయాలని తలపగులగొట్టిన జ్యోత్స్న.. ఆసుపత్రిలో శౌర్య సీరియస్..

Karthika Deepam 2 Today January 15th Episode: అప్పుడే శివన్నారాయణ ఈ టైమ్‌లో ఇంటికి ఎందుకు వచ్చావురా.. అంటాడు. దొంగతనానికా.. అంటాడు. అప్పుడు పారు దాసు నాకోసం వచ్చావా? అంటుంది. లేదమ్మ నేను అన్నయ్య కోసం వచ్చాను అంటాడు. దశరథతో నీకేం పనిరా అంటుంది పారు. మాట్లాడి వెళ్లిపోతాను అమ్మ అంటాడు. ఏ ఆపరా... అసలు నిన్ను ఎవర్రా లోపలికి అనుమతిచ్చింది వీళ్లందరికీ చనువు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోంది. పోరా బయటకు  అంటాడు శివన్నారాయణ అప్పుడు దాసు ఇలాంటి టైమ్‌లో ఏం చెబుతాం. ఇప్పుడు కాకపోతే రేపు అయినా ఈ నిజం అన్నయ్యకు చెబుతా అని జో ను కోపంగా చూస్తాడు. ఏందిరా నిలబడి చూస్తున్నావ్‌ పోరా బయటకు పో అంటాడు దాసును శివన్నారాయణ.

ఏదో జరిగింది గ్రానీ కొడుకుని నమ్మడానికి వీలులేదు. ఈ రెండు రోజులు మమ్మీ డాడీని వదలను అనుకుంటుంది జో. అసలు దాసు ఎందుకు వచ్చాడండి అంటుంది సుమిత్ర. డబ్బు ఏదైనా అవవసరం అయి ఉండొచ్చు అంటుంది. అదే నాకు తెలియడం లేదు అంటాడు దశరథ. దాసు మనసులో ఏదో బాధ ఉంది ఈసారి కలిసినప్పుడు కచ్చితంగా అడగాలి అనుకుంటుంది సుమిత్ర.

మరోవైపు దీప కార్తీక్‌లు యథావిధిగా టిఫిన్‌ సెంటర్‌ నడుపుతుంటారు. అప్పుడే శౌర్య కళ్లు తిరిగి కింద పడుతుంది. వెంటనే కార్తీక్‌ దీపలు పరుగెత్తుకుని వెళ్తారు. శౌర్య.. శౌర్య అని పిలుస్తారు. మందులు కూడా వేశాను బాబు అంటుంది దీప. అప్పుడు కార్తీక్ మళ్లీ హార్ట్‌ ప్రాబ్లెమ్‌ తిరగబడినట్లుంది అని మనసులో అనుకుంటారు. శౌర్య లేస్తుంది ఏమైంది నాన్న? అంటుంది. ఒకసారి ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. నువ్వు టిఫిన్‌ సెంటర్‌ చూసుకో అంటాడు. నేను వస్తా అంటుంది దీప. మేము వెళ్లేది సైకిల్‌పైనా ముగ్గురికి ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి బాబు టెస్ట్‌, ట్యాబ్లెట్లకు డబ్బులు కావాలి కదా అని ఇస్తుంది. శౌర్యకు ఏం కాదు దీప అంటాడు. అనసూయ కూడా చంటి దానికి ఏంకాదు లే దీప నువ్వు కస్టమర్లకు ఏం కావాలి చూసుకో అంటుంది. ఇద్దరూ సైకిల్‌పై కలిసి వెళ్తారు.

ఇదీ చదవండి:   ఉక్కులాంటి దృఢమైన కండలు.. శరీరానికి శక్తినిచ్చే ఈ పప్పు నానబెట్టుకుని తినండి..

ఏదో జరుగుతోంది, కార్తీక్‌ బాబు నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనుకుంటుంది దీప. ఇక ఆసుపత్రిలో శౌర్యకు డాక్టర్‌తో టెస్ట్‌ చేయిస్తాడు. ఇంజెక్షన్‌ వేస్తాడు, నీకు కాస్త కళ్లు తిరిగినట్లు ఉంటుంది పడుకో అమ్మ అంటాడు డాక్టర్. శౌర్య పడుకుంటుంది. డాక్టర్‌ కార్తీక్‌ను పిలుస్తాడు. ఏమైంది డాక్టర్‌ అంటాడు. అప్పుడే దీప కాల్ చేస్తుంది. కాల్ కట్‌ చేస్తాడు కార్తీక్‌. అయ్యో శౌర్యకు ఏమైందో కాల్‌ కట్‌ చేస్తున్నాడు అంటుంది దీప. మళ్లీ కాల్ చేస్తుంది. కాల్‌ లిఫ్ట్‌ చేస్తాడు ఇక్కడ రష్‌గా ఉంది మళ్తీ కాల్‌ చేస్తా దీప అని పెట్టేస్తాడు. పాప మెడికల్‌ కండీషన్‌ మందులతో తగ్గదు, సర్జరీ చేయాల్సిందే అంటాడు డాక్టర్. దీంతో షాకవుతాడు కార్తీక్‌. సర్జరీనా అంటాడు కార్తీక్‌, లేకపోతే గుండె ఎప్పుడు ఆగిపోతుంది చెప్పలేం అంటాడు డాక్టర్. పెద్దగా టైమ్‌ లేదు అంటాడు ఇప్పుడే సర్జరీ ఇప్పుడే చేయాలి అంటాడు.

వీలైనంత త్వరగా పాపను ఆసుపత్రిలో అడ్మిట్‌ చేయాలి. సర్జరీ తర్వాత వన్‌ వీక్‌ ఇక్కడే ఉండాలి అంటాడు. సర్జరీకి ఎంత ఖర్చవుతుంది అంటాడు కార్తీక్‌ రూ.15 లక్షల వరకు అవుతుంది మెడిసిన్స్‌ చాలా కాస్ట్లీ అంటాడు. జాయినింగ్‌ ఫీజు కట్టి పాపను అడ్మిట్‌ చేస్తే ట్రీట్మెంట్‌ స్టార్ట్‌ చేస్తాం అంటాడు.అప్పుడే శౌర్య లేచి నాన్న అంటుంది. మనం ఇంకా ఇంటికి వెళ్లలేదా? అమ్మ కంగారు పడుతుంది మనం వెళ్లిపోదాం అంటుంది. కార్తీక్‌  డాక్టర్‌కు చెప్పి బయలుదేరతారు.

ఇదీ చదవండి:  రైతులకు అదిరిపోయే శుభవార్త.. వచ్చే నెల నుంచే ఖాతాల్లో రూ.10,000..

ఇక దాసు మళ్లీ సుమిత్ర దశరథ్‌లను కలవడానికి వస్తాడు. అప్పుడే శివన్నారాయణ, పారులు గుడికి వెళ్తుంటారు. పైనుంచి జో చూస్తుంది. నువ్వు ఈరోజు ఇంటికి వస్తావు అని రాత్రే అనుకున్నా నా జాగ్రత్తలో నేను ఉన్నా అనుకుంటుంది. తాత కూడా బయటకు వెళ్లిపోయాడు. లోపలికి వచ్చి మమ్మీ డాడీని కలిసేలోపు ఏదైనా చేయాలి అని కిందకు వస్తుంది జో. సుమిత్రమ్మ స్నానం చేస్తుంటుంది. అప్పుడే దరశథ హాల్‌లోకి వస్తాడు. అన్నయ్య గదిలో ఉంటాడు అన్నయ్యకు వదినకు జరిగిందంతా చెబుతా అనుకుని వస్తాడు. సుమిత్ర డోర్‌ లాక్‌ చేస్తుంది జో. డోర్‌ ఎందుకు లాక్‌ చేశావు అంటాడు.

నాన్న నువ్వు బయటకు రా అని లాక్కొని వస్తుంది. చెప్పను అని మాటిచ్చావు కదా.. అంటుంది దీప. నువ్వు తప్పు చేస్తే నేను మాట తప్పుతా అన్నాను కదా అంటాడు. నాన్న ఆ టిఫిన్‌ బండిని నేను కావాలని చేయలేదు ఏదో పొరపాటు జరిగింది అంటుంది. ఇప్పుడు కూడా నిన్ను క్షమిస్తే నువ్వు దీపను బతకనియ్యవు అంటాడు దాసు. అలాంటిదేమి జరగదు నాన్న అంటుంది. నేను నిజం చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తా అంటాడు. నువ్వు చెబితే నీ కూతురు జీవితం నాశనం అవుతుంది నాన్న అంటుంది అయినా ఫర్వాలేదు అంటాడు దాసు. అప్పుడే సుమిత్ర డోర్‌ లాక్‌ అయిన విషయం తెలుసుకుంటుంది. డోర్‌ కొడుతుంది. అయితే, నీ కూతురు చచ్చిపోతుంది అన్నా కూడా వినవా అంటుంది. దాసునెత్తి మీద బలంగా కొడుతుంది జో. వెంటనే అన్నయ్య అని అరుస్తాడు దాసు అప్పుడే ఉలిక్కిపడుతాడు దశరథ.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News