Rekhachithram OTT Streaming: ‘రేఖా చిత్రం’ మలయాలంలో సంచలనం రేపిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రానికి జోఫిన్ టి. చాకో డైరెక్ట్ చేశారు. కావ్య ఫిల్మ్ కంపెనీపై వేణు కున్నప్పిల్లి నిర్మించిన ఈ చిత్రానికి థియేట్రికల్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 75 కోట్ల వసూళ్లను సాధించి రికార్డులు సెట్ చేసింది. ప్రస్తుతం మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రేఖా చిత్రం’ మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.
మలక్కప్పర ప్రాంతంలో జరిగే సంఘటన ఆధారంగా.. పోలీసు ఇన్‌స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. అయితే ఆ కేసుని ఛేదించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేస్తాడు. ఎటు వెళ్లినా కేసు పరిష్కారం కాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి ఆధారంగా నిలుస్తుంది.
సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి సీన్స్ తో ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తయి. గ్రిప్పింగ్ కథనం, ఊహించని మలుపులతో ఫస్ట్ టూ లాస్ట్ ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా సోనీ లివ్‌లోకి మార్చి 7న రాబోతోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఈ సందర్భంగా లీడ్ నటుడు ఆసిఫ్ అలీ మాట్లాడుతూ..‘వివేక్ క్యారెక్టర్ లో నటించడం .. ఈ పాత్రకు న్యాయం చేయడం నాకు ఓ పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అంత ఈజీగా రాదు. ప్రేక్షకుల అంచనాలు, ఊహకు అందకుండా ఈ చిత్రం సాగుతుంది. వాస్తవానికి, ఊహకు మధ్య ప్రేక్షకులు నిజాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. థియేటర్లలో మా సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. మరి మలయాళ ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా మార్చి 7న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఓటీటీలో ఆడియెన్స్‌ని కూడా మా సినిమా మెప్పిస్తుందన్నారు. ఈ సినిమా మలయాళంతో పాటు మిగిలిన సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్, మనోజ్ కె. జయన్, సిద్దిక్, జగదీష్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్‌లతో సహా పవర్‌హౌస్ సమిష్టి తారాగణం ఉన్న ఈ చిత్రానికి సంగీతం ముజీబ్ మజీద్ అందించారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.