VK Naresh Appeals Court టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. మూడో భార్య రమ్య రఘుపతితో వ్యవహారం, పవిత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లిపై ప్రకటన ఇలా అన్నీ కూడా కాంట్రవర్సీకి దారి తీసినవే. ఇక న్యూ ఇయర్ స్పెషల్‌గా లిప్ లాక్ పెట్టుకుంటూ తమ పెళ్లి గురించి ప్రకటించుకున్నారు నరేష్, పవిత్రలు. ఇప్పుడు నరేష్ కోర్టును ఆశ్రయించడంతో అందరూ షాక్ అవుతున్నారు.
తనకు రమ్య రఘుపతి , రోహిత్ శెట్టి తో ప్రాణ హాని ఉంది అని కోర్ట్ ను ఆశ్రయించాడు నరేష్. 2010 మార్చ్ 3న బెంగుళూరులో నరేష్‌కు రమ్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. రమ్యకు 30 లక్షల బంగారం చేయించింది అంటూ తన అమ్మ విజయ్ నిర్మల గురించి చెప్పాడు. పెళ్లి అయిన కొన్ని నెలల నుండే వేదింపులు మొదలయ్యాయని, తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు విధించిందట.
రమ్యకు తనకు 2012లో రణ్వీర్ జన్మించాడని, తనకు తెలియకుండానే పలు బ్యాంకులు, తమరు వ్యక్తుల దగ్గర నుంచి రమ్య తీసుకుందని నరేష్ వివరించాడు. తన పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిందని ఆరోపించాడు. అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు చెల్లించానని, తన కుటుంబ సభ్యుల నుండి మరో 50 లక్షలు తీసుకుందని అసలు విషయాలు చెప్పేశాడు.
ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని, అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారని, సుపారి గ్యాంగ్ ను మాట్లాడుకుని తనను చంపాలనుకుందంటూ సంచలన విషయాలు బయటపెట్టేశాడు నరేష్. 2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు తన ఇంట్లో చొరబడ్డారని, 24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయ మాటలు చెప్పారని నాటి సంగతులు బయటపెట్టేశాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, తనకు నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసిందట.
కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేపించి బెదిరించిందట. తనను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదని తెలిపాడు. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుందట. తన ఫోన్ ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్‌లు చూసేదట. రమ్య వల్ల నరకయాతన అనుభవించాననని, రమ్య వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించండని వేడుకున్నాడు నరేష్.
Also Read: Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్
Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్.. వైరల్ పిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి