Ginger: మీ రెగ్యులర్‌ డైట్‌లో అల్లం చేర్చుకుంటే.. ఆ రోగాలు ఫసక్.. 

Ginger Health Benefits: అల్లం డైట్ లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం ఎన్నో ఏళ్లుగా ఔషధాల్లో వినియోగిస్తున్నారు. వీటిని పొడి రూపంలో తాజాగా లేదా ఎండిన అల్లాన్ని కూడా విక్రయిస్తారు. డైలీ రొటీన్ లో అల్లం చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం ..

Written by - Renuka Godugu | Last Updated : Feb 10, 2025, 06:25 AM IST
Ginger: మీ రెగ్యులర్‌ డైట్‌లో అల్లం చేర్చుకుంటే.. ఆ రోగాలు ఫసక్.. 

Ginger Health Benefits: అల్లం పోషకాలకు పవర్ హౌస్. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని జింజోరెల్‌, విటమిన్ b6, విటమిన్ సి అంతేకాదు పొటాషియం, మెగ్నీషియం మాంగనీస్ కూడా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది బలపరుస్తుంది .

 అల్లం తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలకు చెక్‌ పెడుతుంది. అల్లం మలబద్ధక సమస్యకు మంచి నివారణ. ఇందులోని జింజోరైల్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కడుపులో గ్యాస్ సమస్యకు చక్కని రెమిడీ. అల్లం ఆహారంలో వినియోగిస్తాం. ఇది మంచి రుచిని అందించడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండు. 

 అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ప్రాణాంతక వ్యాధులను మన దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గుండె, డయాబెటిస్, ఆర్థరైటిస్ కి చక్కని రేమిడీ. రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇలాంటి వ్యాధులకు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులకు రెమిడి. 

 అల్లం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. దీంతో సీజనల్ జబ్బులు మన దరిచేరకుండా ఉంటాయి. ఇది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వైరల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్‌ నుంచి అల్లం నివారిస్తుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల తరచుగా వచ్చే సీజనల్ జబ్బులు రాకుండా ఉంటాయి. 

 బరువు తగ్గాలనుకునే వాళ్ళు అల్లం రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ఉదయం అల్లం నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.. రెగ్యులర్ డైట్లో  అల్లం చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కూడా ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. అతిగా ఆకలి వేయనీయదు. 

ఇదీ చదవండి: ఈ పేస్ట్‌ ముఖానికి రాస్తే పార్లర్‌కు వెళ్లాల్సిన పనే లేదు..

 అల్లం తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది కార్డియో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగనివ్వదు. కొన్ని నివేదికల ప్రకారం చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది అల్లం.. ఆరోగ్యకరమైన రక్త సరఫరాకు ప్రేరేపిస్తుంది. బీపీ అదుపులో ఉంచుతుంది, దీంతో గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

ఇదీ చదవండి:  పాలకూరతో ఇవి కలిపి తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి తిరుగుండదు..

 అల్లం తీసుకోవటం వల్ల వయస్సూరీత్యా వచ్చే అభిజ్ఞ సమస్యలు కూడా చెక్ పెడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మన రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ, మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. అల్లం నేరుగా కూడా తింటారు.  ఉదయం పరగడుపున నీటిని తాగడం వల్ల లాభాలు ఎక్కువగా పొందుతారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News