Bhagwant Mann as Punjab Chief Minister: ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం (మార్చి 16) ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆప్ శ్రేణులంతా పసుపు రంగు తల పాగాలు ధరించి హాజరయ్యారు. భగవంత్ మాన్ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా పసుపు రంగు తలపాగాలు ధరించి వచ్చారు.
ప్రమాణస్వీకారం సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతూ.. 'ఇంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమాలంటే ప్యాలెస్‌లు, క్రికెట్ మైదానాల్లో జరిగేవి. కానీ మేము ఖట్కర్ కలన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. మన దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రసాదించిన సమరయోధులను గుర్తుచేసుకునేందుకే ఈ కార్యక్రామాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధులు మన గుండెల్లో ఉంటారు.' అని భగవంత్ మాన్ పేర్కొన్నారు.
భగత్ సింగ్, ఇతర స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ దేశ ప్రజల స్వేచ్చ కోసం పోరాడుతుందని భగవంత్ మాన్ పేర్కొన్నారు. భగత్ సింగ్ కేవలం ఈ దేశ ప్రజల స్వేచ్చ స్వాతంత్య్రాల కోసమే కాదు.. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం ఎవరి చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన చెందాడన్నారు. ఎవరైతే మన నుంచి స్వాతంత్య్రాన్ని లాగేసుకున్నారో.. ఇప్పుడు మనం వారి వద్దకే వెళ్తున్నామని అన్నారు. మెరుగైన సమాజం కోసం, దేశ ప్రగతి కోసం తాము దేశంలోనే ఉండి కృషి చేస్తామన్నారు. నిరుద్యోగం నుంచి వ్యవసాయం వరకు, వ్యాపారం నుంచి స్కూళ్ల వరకు ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒక్క రోజు కూడా వృథా చేయదని.. ఇవాళ్టి నుంచే పని మొదలుపెడుతామని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఢిల్లీలోని స్కూళ్లు, మొహల్లా క్లినిక్‌లను సందర్శించేందుకు జనం ఎలాగైతే వెళ్తున్నారో... మున్ముందు పంజాబ్‌కు కూడా జనం అలా వస్తారని అన్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయనివారి కోసం కూడా తాము పనిచేస్తామని... వారికి కూడా తాము ప్రభుత్వమేనని అన్నారు.'విప్లవం వర్ధిల్లాలి..' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
What a moment ❤️🥺
Punjab di Aan, Baan aur Shaan, Sardar @BhagwantMann takes oath as the Chief Minister of Punjab#PunjabDaCMMann pic.twitter.com/jRcl1zjQ8i
— AAP (@AamAadmiParty) March 16, 2022
Also Read: Navjot Singh Sidhu: సోనియా ఆదేశాలతో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకున్న సిద్ధూ
Also read: India Corona Update: దేశంలో కొత్తగా 2,876 మందికి కొవిడ్- తగ్గిన యాక్టివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook