Peoples Pulse, Kodimo Exit Poll Results: పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థలు సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో ఓటర్లు బీజేపీ వైపు నిలిచారని వెల్లడైంది. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని ఆ సర్వే సంస్థ వెల్లడించింది. డబుల్ ఇంజన్ సర్కార్‌ను ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని పీపుల్స్ పల్స్ - కొడిమో తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 51 - 60, ఆమ్ ఆద్మీ పార్టీ 10-19, కాంగ్రెస్, ఇతరులు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని తన సర్వేలో వెల్లడించింది.
Also Read: Delhi Exit Poll 2025: ఢిల్లీ మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీదే!.. ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళి ఇదే
ఓట్ల శాతం ఇలా..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48.5- 52.5 ఓట్లు పొందుతుందని.. ఆమ్ ఆద్మీ పార్టీకి 36.5 నుంచి 40.5 శాతం ఓట్లు పడతాయని ఆ సర్వే సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర ఫలితాలు ఉంటాయని.. ఆ పార్టీకి ఓటింగ్ శాతం 6.5-8.5 మాత్రమే ఉంటుందని వెల్లడించింది. ఇతరులు 3.1-5.1 ఓట్లు పొందే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించాయి.
Also Read: Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్! పాత పన్ను విధానం రద్దు లేదు'
ఈ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను సమగ్రంగా విశ్లేషిస్తే ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మహిళా ఓటర్లు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లలో బీజేపీపై ఆప్ 8.3 శాతం ఆధిక్యత కనబరుస్తోందని ఆ సంస్థలు తెలిపాయి. మహిళలు ఆప్‌కు 50.20 శాతం, బీజేపీకి 41.90 శాతం, కాంగ్రెస్‌కు 6.10 శాతం, ఇతరులకు 1.90 శాతం మద్దతిస్తున్నారని పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థలు తెలిపాయి. కమలం పార్టీకి బ్రాహ్మణులు, రాజ్‌పుత్, యాదవ్, జాట్, బనియా, కశ్మీరీ పండిట్లు, గుప్త సామాజికవర్గాలు మద్దతిచ్చారని.. అగ్రవర్ణాలు, వెనుకబడిన ఓబీసీలు, దళితులు ఆప్ వైపు నిలిచారని వెల్లడించింది.
ఈ వర్గాలు ఈ పార్టీలతో..
హిందువులు, జైన్లు, ఇతరులు బీజేపీకి, ముస్లింలు, సిక్కులు ఆప్‌కు మద్దతిచ్చారని పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థలు తెలిపాయి. బీజేపీకి పూర్వాంచల్, ఢిల్లీ, ఉత్తరాది, హర్యానాబి, పాహడి ప్రాంతాలకు చెందిన ప్రజలు మద్దతిస్తుండగా.. ఆమ్‌ఆద్మీ పార్టీకి పంజాబీలు, దక్షిణాది ప్రజలు మద్దతిస్తున్నారని వెల్లడించింది. ఆమ్‌ఆద్మీ పార్టీకి దళితులు, ముస్లింలు, సిక్కులు, జాదవ్, చమార్, వాల్మీకి సామాజికవర్గాల్లో అధిక మద్దతు లభిస్తోంది. మోస్ట్ పాపులర్ నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఆ సంస్థలు పేర్కొన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.