Nitish kumar: నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?.. మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్...

Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 8, 2024, 06:53 PM IST
  • యూటర్న్ తీసుకున్న నితీష్ కుమార్..?..
  • దేశ రాజకీయాల్లో రచ్చగా మారిన ఘటన..
 Nitish kumar: నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?.. మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్...

India bloc offered pm post to bihar jdu leader nitish kumar: దేశంలో మూడోసారి ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేపట్టారు.18 వ లోక్ సభ కు ప్రజలు వినూత్నంగా తమ తీర్పునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు.  కనీసం మ్యాజిక్ ఫిగర్ 272 కూడా చేరుకోలేక పోయింది. బీజేపీ కేవలం 240 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ క్రమంలో బీజేపీ మిత్ర పక్ష పార్టీల మీధ ఆధార పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. బీజేపీ నేతలు ఇప్పటికే ఇటు ఏపీ నుంచి చంద్రబాబు 16, అటు బీహర్ నుంచి నితీష్ కుమార్ 12 స్థానాల మద్దతుతో.. 292 స్థానాలకు చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా అన్నిరకాలుగా సిద్దమైంది.  రేపు (ఆదివారం) సాయంత్రం వేళ ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేశారు.  ఈ క్రమంలో ఒక పిడుగులాంటి వార్త ప్రస్తుతం దేశంలో హాట్  టాపిక్ గా మారింది.

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

రాజ్య సభ మాజీ ఎంపీ కేసీ త్యాగీ ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ కు ప్రధాని పదివీ ఆఫర్ వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిప్పుడు దేశ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. ఒకవైపు దేశంలో ఎంపీలు, తమ మిత్ర పక్షల సపోర్టుతో మోదీ ప్రమాణ స్వీకారానికి సిద్దమయ్యారు. ఇప్పటికే అనేక దేశాల నుంచి అతిరథ మహరథులు వస్తున్నారు.  ఇతర దేశాల నుంచి కూడా అతిథులు మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారొత్సవానికి రానున్నారు. ఇప్పటికే అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా వెళ్లిపోయాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ ఆఫర్ను ఇండియా కూటమి చేసిందంటూ, కేసీత్యాగీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా  మారింది.

పూర్తి వివరాలు..

ఇటీవల.. ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీ త్యాగి మాట్లాడుతూ..  నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందన్నారు. ఇండియా కూటమి నుంచి ఒక కీలకమైన వ్యక్తి నుంచి ఈ ఆఫర్ వచ్చిందంటూ త్యాగి కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కానీ నితీష్ కుమార్ మాత్రం.. తాను ఎన్డీయేలోనే ఉంటానని తెల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ చేసింది ఎవరు అని ఆరా తీయగా.. దానిపై స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు.  దీంతో ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర దుమారంగ మారింది.

క్లారిటీ ఇచ్చిన ఇండియా కూటమి..

రాజ్యసభ మాజీ ఎంపీ కేసీ త్యాగి వాదనల్ని మాత్రం కాంగ్రెస్ ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని, నితీశ్‌కు ఎవరూ పీఎం పదవిని ఆఫర్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సైతం స్పందించారు.. ‘‘కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. అలాంటి సమాచారం మాకు అందలేదు. నాకు తెలిసి.. కేసీ త్యాగి ఒక్కరికే ఈ విషయం తెలిసి ఉండాలంటూ సెటైర్ వేశారు. 

Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

యూటర్న్ లు తీసుకొవడంలో ఇద్దరు ఇద్దరే..

ఇక దేశంలో నితీష్ కుమార్, చంద్రబాబు ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు ఇద్దరే. పార్టీలు మారడంలోను, రాజకీయాలు చేయడంలోను ఇద్దరు మంచి నేర్పరులే. పోద్దున అలయ్ భలయ్ అంటూ, సాయంత్రం కాగానే తలాక్ లు చెప్తుంటారు. ఇలాంటి పీక్స్ సమయంలో నితీష్ కుమార్ యూటర్న్ ఆరోపణలు ఢిల్లీ రాజకీయాల్లో, బీజేపీ నేతల్లో ఒకింత టెన్షన్ పెట్టేదిగా మారిందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News