భారతీయ టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటివరకు నిత్యం 1జీబీ డేటా అందించే అన్ని టారిఫ్లని పునఃసమీక్షించనున్నట్టు ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో.. నేటి నుంచి కొత్త టారిఫ్ లు అందుబాటులోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం ఇప్పటివరకు వున్న ధరకన్నా రూ.50 తక్కువ చార్జ్ చేయడం ఒక విధానం అయితే, అదే పాత ధరకు 50 శాతం డేటాను అధికంగా అందించడం మరో విధానం. వినియోగదారులు ఎంచుకున్న విధానాన్నిబట్టి ఆయా టారిఫ్ లు వర్తించనున్నట్టు జియో పేర్కొంది.
కొత్తగా నేటి నుంచి అమలు కానున్న రెండు రకాల టారిఫ్ల విధానం ఇలా వుండనుంది.
ధరల్లో తగ్గింపు వుండే టారిఫ్ల విధానం:
జియో రూ.149 ప్లాన్- గతంలో ఇదే ప్లాన్ రూ.199గా వుండేది. ఈ ప్లాన్ ప్రకారం 28 రోజులపాటు 28 జీబీ డేటా లభించనుంది.
రూ.349 ప్లాన్: ఈ ప్లాన్ పాత ధర రూ.399గా వుండేది. ఈ ప్లాన్ ప్రకారం 70 రోజులపాటు 70 జీబీ డేటా లభించనుంది.
రూ.399 ప్లాన్: గతంలో జియో ఇదే ప్లాన్ ని రూ.459కి అందించగా ఇప్పుడు ఆ ధరని రూ.50 తగ్గించి రూ.399కే అందించేందుకు సిద్ధమైంది. ఈ ప్లాన్ ప్రకారం వినియోగదారులకి 84 రోజులపాటు 84 జీబీ డేటా ఇంటర్నెట్ లభించనుంది.
రూ.449 ప్లాన్ : గతంలో ఇదే ప్లాన్ ధర రూ.499గా వుండేది. కానీ ఇప్పుడు రూ.50 తక్కువకే.. అంటే రూ.449కే లభించనుంది. ఈ ప్లాన్ ప్రకారం రీచార్జ్ చేసుకున్న వారికి 91 రోజులపాటు 91 జీబీ డేటా లభిస్తుంది.
అధిక డేటా అందించే టారిఫ్ల విధానం:
రూ.198 ప్లాన్ : ఈ ప్లాన్ ప్రకారం రీచార్జ్ చేసుకున్న వారికి గతంలో 28 రోజులకి గాను 28 జీబీ డేటా లభించగా ఇకపై 42 జీబీ డేటా లభించనుంది.
రూ.398 ప్లాన్ : గతంలో ఈ ప్లాన్ ప్రకారం 70 రోజులకి గాను 70 జీబీ డేటా లభించగా ఇకపై అదే మొత్తానికి 70 రోజులకిగాను 105 జీబీ డేటా లభించనుంది.
Rs 448 plan: Jio now offers 126GB data for 84 days. It was 84 GB before.
రూ.448 ప్లాన్ : గతంలో 84రోజులకిగాను రోజుకి 1 జీబీ డేటా చొప్పున 84 జీబీ డేటా మాత్రమే లభించేది. కానీ ఇకపై ఇదే ధరకు 126 జీబీ డేటా అందుబాటులోకి రానుంది.
రూ.498 ప్లాన్ : గతంలో ఇదే ధరకు 91 రోజులకి గాను 91 జీబీ డేటా లభించగా ఇకపై అదే ధరకు 91 రోజుల వ్యాలిడిటీతో 136 డీబీ డేటా లభించనుంది.