Aloevera Serum: కలబంద హెయిర్‌ సీరమ్‌ ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి..

Aloevera Hair Serum: కలబంద జెల్‌ అంటే దీన్ని కలబంద ఆకులతో తయారు చేస్తారు. ఇంట్లో చాలామంది కలబందను పెంచుకుంటారు. ఆకులోపలి భాగం నుంచి కలబంద జెల్ తయారు చేస్తారు. ఇది జెల్‌ మాదిరి కలిగి ఉంటుంది

Written by - Renuka Godugu | Last Updated : Aug 29, 2024, 10:21 AM IST
Aloevera Serum: కలబంద హెయిర్‌ సీరమ్‌ ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి..

Aloevera Hair Serum: కలబంద పోషకాలకు పవర్‌ హౌజ్‌. ఇందులో ముఖ్యంగా హెయిర్‌ రొటీన్లో ఉపయోగించే గుణాలు కలిగి ఉంటాయి. కలబంద జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. అయితే, ఇంట్లోనే మీరు సులభంగా కలబంద సీరమ్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ రిసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కలబంద జెల్‌..
కలబంద జెల్‌ అంటే దీన్ని కలబంద ఆకులతో తయారు చేస్తారు. ఇంట్లో చాలామంది కలబందను పెంచుకుంటారు. ఆకులోపలి భాగం నుంచి కలబంద జెల్ తయారు చేస్తారు. ఇది జెల్‌ మాదిరి కలిగి ఉంటుంది. ఇందులో మన చర్మం, జుట్టుకు మంచి పోషణ అందించే గుణాలు కలిగి ఉంటాయి. మార్కెట్‌లో వివిధ ఉత్పత్తుల్లో కలబందను విరివిగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌ నుంచి కూడా కలబంద జెల్ ను కొనుగోలు చేయవచ్చు. లేదా ఇంట్లో పెంచుకునే కలబంద మొక్క నుంచి కూడా ఈ కలబంద జెల్ తయారు చేసుకోవచ్చు.

జుట్టుకు కలబంద లాభాలు..
కలబందలో నేచురల్‌ గుణాలు ఉంటాయి. ఇది జుట్టుకు మాయిశ్చర్‌ అందిస్తుంది. ఇది జుట్టుకు లోతైన పోషణ అందిస్తుంది. మృదువుగా మారుస్తుంది. దీంతో జుట్టుకు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

కలబందలో ప్రొటియోలైటిక్‌ ఎంజైమ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది డెడ్‌ స్కిన్ సెల్స్‌ను రిపేయిర్‌ చేస్తుంది. ఇది హెయిర్‌ ఫాల్‌ సమస్యకు చెక్‌ పెట్టి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

ముఖ్యంగా కలబందలో యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది డ్యాండ్రఫ్ కు కూడా చెక్‌ పెడతాయి. అంతేకాదు తలలో దురద ఉంటే కూడా తగ్గిపోతుంది.

కలబంద జుట్టును బలంగా మారుస్తుంది. హెయిర్‌ స్ప్లట్స్‌ రాకుండా నివారిస్తుంది. దీంతో జుట్టు మందంగా అందంగా కనిపిస్తుంది.
కలబంద జుట్టు పీహెచ్ స్థాయిలను నిర్వహిస్తుంది. దీంతో ఎటువంటి వాతావరణంలో అయినా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

కలబంద సీరమ్‌ తయారీ విధానం..
కావాల్సిన పదార్థాలు..
కలబందజెల్‌ -2tbsp
కొబ్బరినూనె- 1tbp (ఆలివ్‌ ఆయిల్‌ లేదా జోజోబా ఆయిల్‌)
ఎసెన్షియల్‌ ఆయిల్‌ (ఆప్షనల్‌)
ఒక చిన్న బాటిల్‌

 ఈ ఆకు రసం తెల్లజుట్టును 5 నిమిషాల్లో నల్లగా మారుస్తుంది.. సాయి పల్లవి హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో ఇది తప్పనిసరట..

కలబంద జెల్‌ ఇంట్లో మొక్క నుంచి తీసుకుని లోపలి జెల్‌ తీసి పెట్టుకోవాలి
ఆ తర్వాత ఒక గిన్నెలో జెల్‌ వేసుకుని అందులో కొబ్బరినూనె  కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మంచి పేస్ట్‌ తయారవుతుంది. ఇందులో కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కూడా వేయాలి. దీంతో మంచి సువాసన వస్తుంది.

మీ మాజీతో మళ్లీ స్నేహం చేయాలనుకుంటున్నారా? ఇది సరైందా? కాదా?

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ బాటిల్లోకి మార్చుకోవాలి. బాగా కలిపిన తర్వాత జుట్టుకు ఉపయోగించాలి. దీన్ని జుట్టుక కుదుళ్ల నుంచిఅప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా తలస్నానం చేసి జుట్టు ఆరిన తర్వాత అప్లై చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter 

Trending News