Sankranti Horoscope 2025: సంక్రాంతి రోజు ఇవాళ మేష రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
ఇక వృషభ రాశి జాతకులకు సైతం చాలా అనుకూలమైన రోజు. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టే యోగం ఉంది. ఉద్యోగస్థులకు పదోన్నతి, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారులు ఆర్ధికంగా ప్రయోజనం పొందుతారు. వృత్తి రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఆర్ధికంగా లాభపడతారు.
మిధున రాశి జాతకులకు గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు అనువైన సమయం. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.
కర్కాటక రాశి జాతకులకు చాలా బాగుంటుంది. ఏ పని పూర్తిచేసిన దిగ్విజయంగా పూర్తవుతుంది. విద్యార్ధులయితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి జాతకులకు చాలా మంచి రోజు. ఇంట్లో కొత్త వస్తువులు లేదా కొత్త వాహనం కొనుగోలుచేయవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. వ్యాపారంలో అమితమైన లాభాలుంటాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు మంచి సమయం.
కన్యా రాశి జాతకులకు ఇది చాలా అనువైంది. పెండింగులో పనులు, కొత్త పనులకు బాగుంటుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్ధికంగా లాభం కలుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి జాతకులకు పట్టిందంతా బంగారమౌతుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ప్లానింగ్ ప్రకారం చేసిన ప్రతి పని విజయవంతమౌతుంది.
ధనస్సు రాశి జాతకులకు ఆర్ధికంగా ప్రయోజనం కలుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలు అందిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకే కాకుండా విద్యార్ధులకు సైతం అనువైన రోజు. వృత్తి నిపుణులు కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం
మకర రాశి జాతకుల్లో ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులకు మంచి సమయం. ప్రతి రంగంలో లాభాలుంటాయి. వ్యాపారులు ఆర్ధికంగా ప్రయోజనం పొందుతారు. విద్యార్ధులకు బాగుంటుంది.
కుంభ రాశి జాతకులకు అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు అనువైన సమయం. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లేదా పదోన్నతి లభిస్తుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది.
మీన రాశి జాతకులకు చాలా అనువైన సమయం. కెరీర్‌పరంగా అద్బుతంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పని చేసే చోట గౌరవం ఉంటుంది. ఊహించని సంపద లభిస్తుంది. దాంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఎలాంటి ఆర్ధిక సమస్యలుండవు.
Also read: Pushya Masam: 102 ఏళ్ల అరుదైన సంయోగం, ఈ మూడు రాశులకు మహర్దశ నేటి నుంచి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.