Shani Dev Effect: అన్ని గ్రహాలతో పోలిస్తే శని గ్రహాన్ని ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాగే ఈ గ్రహం సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సమయం పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రహం కుంభరాశిలో సంచార దశలో ఉంది అయితే అతి త్వరలోనే అంటే మార్చి 29వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. ఇదిలా ఉంటే శని గ్రహం త్వరలోనే కదలికలు జరపబోతోంది. శని గ్రహం ఫిబ్రవరి చివరివారాల్లోనే కదలికలను జరిపి మార్చి నెలలో మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని గ్రహం ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కదలికలు జరపడం వల్ల ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో.. ఈ ప్రభావం వల్ల అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అత్యధిక లాభాలు పొందబోయే రాశుల్లో ధనస్సు రాశి ఒకటుంటుంది. ధనస్సు రాశిలో జన్మించిన వారు శనిదేవుడి అనుగ్రహం పొంది.. భౌతిక ఆనందంతో పాటు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. వీరు ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఎప్పటినుంచి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది. వైవాహిక జీవితం పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే వీరికి సమయంలో సమాజం నుంచి మంచి పేరు కూడా లభిస్తుంది.
మకర రాశి
ఈ సమయంలో మకర రాశి వారికి కూడా ఎంతో బాగుంటుంది. వీరికి కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా ఆర్థికంగా వృద్ధి చెందుతారు అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులు చేసిన బోలెడు లాభాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి శని అనుగ్రహం లభించి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా డబ్బులు భారీ మొత్తంలో పొందగలుగుతారు. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారు ఈ సమయంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. దీని కారణంగా భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి అనుకున్న పనులు అనుకూలత పెరిగి విపరీతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కెరీర్ కు సంబంధించిన విషయాల్లో కూడా వృద్ధి పొందుతారు. ఇక వ్యాపారాలతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్స్ లభిస్తాయి. దీనివల్ల ఆర్థికంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు విదేశీ ఒప్పందాలు కూడా జరుపుకునే ఛాన్స్ ఉంది. దీనివల్ల జీవితంలో ఎన్నడు పొందలేనంత డబ్బు పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో సంతోషమైన వాతావరణం నెలకొంటుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి