Triveni Raja Yoga Effect: ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్య రోజునే చాలామంది భక్తులు దానాలతో పాటు నదీ స్నానమాచరిస్తారు. ఇలా చేయడం వల్ల తలచారాలుగా వస్తున్న పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. అయితే మౌని అమావాస్య రోజున ఎంతో శక్తివంతమైన త్రివేణి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ మౌని అమావాస్య రోజునే మకర రాశిలో సూర్య, చంద్ర, బుధ గ్రహాల కలయిక జరగబోతోంది. అయితే ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఎంతో శక్తివంతమైన ఈ త్రివేణి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలా అరుదుగా ఏర్పడే యోగం వల్ల కొన్ని రాశుల వారు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రివేణి యోగం ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందట. కాబట్టి ఈ ప్రభావం ఏయే రాశుల వారిపై పడుతుందో ఆయా రాశుల వారు దీర్ఘకాలికంగా లాభాలు పొందడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో డబ్బు పొందుతారు.
మకర రాశి
మకర రాశి వారికి ఈ త్రివేణి యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయం చాలా మేలు చేయబోతోంది. వీరు ఎదురుచూస్తున్న ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. అలాగే జీవితం మొత్తం సానుకూల మార్పులతో ప్రారంభం కాబోతోంది. వ్యాపారాలు చేసే వారు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందబోతున్నారు.
వృషభ రాశి
త్రివేణి రాజయోగం వల్ల వృషభ రాశి వారు కూడా చాలావరకు లాభపడతారు. ఈ సమయంలో వీరు మతపరమైన పర్యటనలు చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే వీరు పూర్వీకుల నుంచి పొందాలనుకున్న ఆస్తులు కూడా సులభంగా పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా దూరమ వుతాయి. గతంలో వచ్చిన అనేక సమస్యలకు ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ ప్రత్యేకమైన త్రివేణి యోగం ఏర్పడడం వల్ల అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితం, ప్రేమ జీవితం ఈ సమయం లో సానుకూలంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులకు కూడా ఈ సమయంలో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులు వేస్తారు. దీనివల్ల కూడా ఈ రాశి వారికి ఎంతో మేలు జరగబోతోంది. ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి త్రివేణి యోగం వల్ల వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సంతానం లేని వ్యక్తులకు ఈ సమయంలో పండంటి బిడ్డ జన్మించే ఛాన్స్ కూడా ఉంది. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లలనుంచి శుభవార్తలు కూడా వింటారు. అలాగే వీరు అదృష్టాన్ని కూడా పొందగలుగుతారు. దీనివల్ల ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యంపరంగా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మానసిక సమస్యలు దూరం అవుతాయి.
(నోట్: ఈ స్టోరీ కేవలం నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు దృవీకరించదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter