Arjun Tendulkar Maiden IPL Wicket: రెండు వరుస విజయాలు సాధించి జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ముంబై ఇండియన్స్ జట్టు షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. అనంతరం 193 రన్స్ టార్గెట్‌లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్‌కి ఇది వరుసగా మూడో విజయం కాగా.. ఎస్ఆర్హెచ్కు ఈ సీజన్లో మూడో ఓటమి. ఈ గెలుపుతో ముంబై జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్-6కు దూసుకెళ్లింది. సన్‌రైజర్స్ జట్టు చివరి నుంచి రెండోస్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ జోష్‌లో కనిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భువనేశ్వర్‌ను ఔట్ చేసి ఐపీఎల్లో తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వికెట్‌తో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయానికి చివరి ఓవర్లో 20 పరుగులు కావాలి. ఈ సమయంలో రోహిత్ శర్మ అర్జున్ టెండూల్కర్‌కు బంతి అప్పగించాడు. క్రీజ్‌లో అబ్దుల్ సమాద్ ఉండడంతో ఏదైనా అద్భుతం జరుగుతుందని హైదరాబాద్ అభిమానులు అనుకున్నారు. మొదటి బంతిని అర్జున్ డాట్ చేయగా.. రెండో బంతికి సమాద్ రనౌట్ అయ్యాడు. తర్వాతి రెండు బంతుల్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఐదో బంతిని భువనేశ్వర్ షాట్‌కు యత్నించగా.. రోహిత్ శర్మ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. తొలి వికెట్ తీయడంతో అర్జున్ టెండూల్కర్‌తోపాటు రోహిత్ శర్మ కూడా సంబరాలు చేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆడుతుంటే తనకు పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయన్నాడు. తాను ఇక్కడ మూడు సీజన్లు ఆడానని.. ఒక ట్రోఫీని గెలుచుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ తొలిసారి ఆడుతున్న ఆటగాళ్లకు సపోర్ట్ చేయడం ముఖ్యమని అన్నాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నానని అన్నాడు. తమకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందని.. బ్యాట్స్‌మెన్ ధైర్యంగా బ్యాటింగ్ చేసేలా చూసుకోవాలన్నాడు.
A special moment for young Arjun Tendulkar, who gets his first wicket in #TATAIPL and it is his captain Rohit Sharma, who takes the catch of Bhuvneshwar Kumar.
Arjun takes the final wicket and @mipaltan win by 14 runs. pic.twitter.com/1jAa2kBm0Z
— IndianPremierLeague (@IPL) April 18, 2023
Also Read: ఆ విషయం బాధ కలిగింది.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. మాజీ మంత్రి ప్రకటన
అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. అర్జున్‌తో కలిసి చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని అన్నాడు. అర్జున్ గత మూడేళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడని.. అతను ఎదగడం తాను చూస్తున్నానని చెప్పాడు. అర్జున్ ఏం చేయాలనుకుంటున్నాడో తనకు అర్థమైందని.. కొత్త బంతితో స్వింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపాడు. అంతేకాకుండా స్లాగ్ ఓవర్లలో యార్కర్స్ చక్కగా వేస్తున్నాడని అభినందించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి