IPL title sponsor rights: 2024-28 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన టైటిల్ హక్కులను టాటా గ్రూప్ (TATA Group) కంపెనీ దక్కించుకుంది. మరో ఐదేండ్ల వరకు టాటా గ్రూపే టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈమేరకు టాటా గ్రూప్ సంవత్సరానికి 500 కోట్లు చొప్పున 5 ఏళ్లకు రూ.2500 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
టాటా కంపెనీ తొలిసారి 2022లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. సీజన్‌కు రూ.365 కోట్లు చెల్లించేందుకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. 2023 సీజన్ కు కూడా టాటానే స్పాన్సర్‌గా వ్యవహారించింది. దీని కంటే ముందు టైటిల్ స్పాన్సర్‌గా వీవో కంపెనీ ఉండేది. చైనీస్ మెుబైల్ కంపెనీ అయిన వీవో 2017లో ఐపీఎల్ టైటిల్ హక్కులను సొంతం చేసుకుంది. 2018-22 వరకు జరిగే ఐదు ఐదు సీజన్‌ల కోసం సంవత్సరానికి రూ. 440 కోట్లు చొప్పున మెుత్తం రూ. 2,199 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2020లో డ్రీమ్11 ఒక సీజన్‌కు స్పాన్సర్ గా వ్యవహారించింది. దీంతో వీవో కాంట్రాక్ట్ ను 2023 వరకు పొడిగించింది. అయితే కొన్ని షరతులతో టాటా మిగిలిన స్పాన్సర్‌షిప్ హక్కులను కైవసం చేసుకుంది.
ఈ ఏడాది ఐపీఎల్ 17వ సీజన్ మార్చి చివరిలో మెుదలవ్వనుంది. ఇప్పటికే వేలం ముగిసిన నేపథ్యంలో టైటిల్ వేట కోసం జట్లన్నీ వ్యహాలుకు పదునుపెడుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు అయితే ఏకంగా కొత్త కోచ్‌లనే నియమించుకున్నాయి. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌లు ఈసారి ఎలాగైనా గెలవాలని కసి మీదున్నాయి.
Also Read: WTC 2023-2025: ఆసీస్ దెబ్బకు నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా!
Also Read: NZ vs PAK: కివీస్ టీమ్ లో కరోనా కలకలం.. ఆ స్టార్ ఓపెనర్‌కు పాజిటివ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter