Boundary Rope: పెవిలియన్ వెళ్తుండగా.. బౌండరీ రోప్ వద్ద కిందపడిన బ్యాటర్! నవ్వులు పూయిస్తున్న వీడియో

UAE Batter falls down after tripping over boundary rope. బౌండరీ రోప్ తగిలి యూఏఈ బ్యాటర్ అయాన్ అఫ్జల్ ఖాన్‌ కిందపడి పోయాడు. ఈ సరదా ఘటన టీ20 ప్రపంచకప్‌ 2022లో చోటుచేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 17, 2022, 02:16 PM IST
  • పెవిలియన్ వెళ్తుండగా
  • బౌండరీ రోప్ వద్ద కిందపడిన బ్యాటర్
  • నవ్వులు పూయిస్తున్న వీడియో
Boundary Rope: పెవిలియన్ వెళ్తుండగా.. బౌండరీ రోప్ వద్ద కిందపడిన బ్యాటర్! నవ్వులు పూయిస్తున్న వీడియో

UAE Batter falls down after tripping over boundary rope: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ సంఘటనలు చోటుచేసుకుంటాయి. బ్యాటర్స్ సమన్వయ లోపం కారణంగా రనౌట్ అవ్వడం, ఇద్దరు ఫీల్డర్లు ఒకేసారి క్యాచ్ పట్టుకోవడానికి వెళ్లి నేలపాలు చేయడం, బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసేటపుడు ప్లేయర్ కిందపడడం లాంటి సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా అంతకుమించి అనేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. బౌండరీ రోప్ తగిలి బ్యాటర్ కిందపడ్డాడు. ఈ ఘటన టీ20 ప్రపంచకప్‌ 2022లో చోటుచేసుకుంది. 

టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం యూఏఈ, నెదర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యూఏఈ బ్యాటర్ అయాన్ అఫ్జల్ ఖాన్‌.. 5 పరుగులకే ఔట్ అయ్యాడు. 16 ఏళ్ల అయాన్ నిరాశతో పెవిలియన్ చేరుతుండగా.. బౌండరీ రోప్ కాలికి తట్టుకుని కిందపడిపోయాడు. నిరాశలో నడుస్తూ చూసుకోకుండా రోప్కి కాలు తగలడంతో కిందపడిపోయాడు. వెంటనే లేచి డ్రెస్ రూంకి వెళ్లాడు.

అయాన్ అఫ్జల్ ఖాన్‌ కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్స్ బార్మీ ఆర్మీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మ్యాచులో నెదర్లాండ్ 19.5 ఓవర్లలో 112 రన్స్ చేసి విజయం సాధించింది. అయాన్ అఫ్జల్ బ్యాట్‌తో విఫలమయినప్పటికి.. బంతితో మెరిశాడు. మూడు ఓవర్ల వేసి ఒక వికెట్ తీసి 15 పరుగులు ఇచ్చాడు. అయాన్ 16 సంవత్సరాల 335 రోజులకు టీ20 ప్రపంచకప్ ఆడాడు. దాంతో మహ్మద్ అమీర్ రికార్డును (టీ20 ప్రపంచకప్లో ఆడిన అతి పిన్న వయస్కుడిగా) బద్దలు కొట్టాడు. 

Also Read: ICC T20 World Cup: క్రికెట్‌ ప్రపంచమా.. నమీబియా పేరు గుర్తుపెట్టుకో: సచిన్‌

Also Read: IND Vs AUS: చివరి 4 బంతుల్లో నాలుగు వికెట్స్.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News