New Lenovo Legion Tab 2024: లెనోవో కంపెనీ లాంచ్ చేసే ట్యాబ్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ట్యాబ్స్‌ను కంపెనీ ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ వస్తుండడంతో యువత ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ మార్చి నెలలో అందుబాటులోకి తీసుకు వచ్చిన గేమింగ్ టాబ్లెట్ లెనోవో లెజియన్‌కి మంచి ప్రజాదరణ లభించింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో లైవ్ అవుతోంది. కానీ కంపెనీ ఈ ట్యాబ్‌కి సంబంధించిన అధికారిక లాంచింగ్ వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్ ట్యాబ్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Lenovo Legion Tab ధర వివరాలు:
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ టీజర్ లైవ్ అవుతున్న వివరాల ప్రకారం, ఈ ట్యాబ్ త్వరలోనే భారత్‌లోకి లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, కంపెనీ ఈ Lenovo Legion Tab ధర రూ.65,000తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది కేవలం వైఫై వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది. దీనిని ముందుగా కంపెనీ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కొన్ని న్యూస్ వెబ్‌సైట్స్ అందించిన వివరాల ప్రకారం, ఈ ట్యాబ్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్ జూలై 19న ప్రారంభం కానుంది. విడుదలకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
లెనోవో లెజియన్ ట్యాబ్లెట్ వివరాలు:
రోజు గేమ్స్ ఆడేవారికి ఈ ట్యాబ్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ టాబ్లెట్‌తో పాటు కంపెనీ కొన్ని పరికరాలను కూడా అందించబోతోంది. దీంతో పాటు పెద్ద టీవీలను కనెక్ట్ చేయడానికి DisplayPort 1.4 సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే దీనిని కంపెనీ అందించే మౌస్‌తో పాటు కీబోర్డ్ ఇతర పరికరాలను కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్ డిస్ల్పే వివరాల్లోకి వెళితే, ఇది 8.8-అంగుళాల QHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
8.8-అంగుళాల QHD+ డిస్‌ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
500 nits బ్రైట్‌నెస్
Qualcomm Snapdragon 8+ Gen 1 4nm ప్రాసెసర్
12GB LPDDR5X ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్
13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
2-మెగాపిక్సెల్ సెకండరీ మాక్రో కెమెరా
Qualcomm Quick Charge 3.03 టెక్నాలజీ
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
LTE కనెక్టివిటీ
6550 mAh బ్యాటరీ
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి